జస్ప్రిత్ బుమ్రా లేడు! జోఫ్రా ఆర్చర్ వస్తాడో రాడో తెలీదు... ముంబై ఇండియన్స్‌కి మరోసారి కష్టమే...

Published : Mar 01, 2023, 09:56 AM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్‌కి రెండు సీజన్లుగా ఏదీ కలిసి రావడం లేదు. ఐపీఎల్ 2020 సీజన్‌లో రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది...

PREV
19
జస్ప్రిత్ బుమ్రా లేడు! జోఫ్రా ఆర్చర్ వస్తాడో రాడో తెలీదు... ముంబై ఇండియన్స్‌కి మరోసారి కష్టమే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 7 మ్యాచుల్లో గెలిచిన ముంబై ఇండియన్స్, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో నాకౌట్ స్టేజీకి అర్హత సాధించలేకపోయింది. సరిగ్గా 7 మ్యాచుల్లో గెలిచిన కేకేఆర్, నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్ చేరి ఫైనల్ కూడా ఆడింది...

29

2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్, ఐపీఎల్ కెరీర్‌లో చెత్త ప్రదర్శన కనబర్చింది. 2022 మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్‌ని రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, ముంబైకి ఘన విజయాలు అందించిన ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ బౌలర్లను తిరిగి కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు...

39
Image credit: PTI

14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, 4 విజయాలతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఆఖరి స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో కుమార్ కార్తికేయ, జయ్‌దేవ్ ఉనద్కట్, డానియల్ సామ్స్, రిలే మెడరిత్, హృతిక్ షోకీన్ వంటి ప్లేయర్లను బౌలర్లుగా వాడింది ముంబై ఇండియన్స్.. 

49

జస్ప్రిత్ బుమ్రా మొదటి నాలుగు మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయినా ఆ తర్వాత రిథమ్ అందుకుని 14 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. అయితే గాయంతో బుమ్రా, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మరో 6 నెలల పాటు బుమ్రా, క్రికెట్ ఆడడం అనుమానమేనని వార్తలు వినిపిస్తున్నాయి...

59

మరోవైపు రూ.8 కోట్లు పెట్టి 2022 మెగా వేలంలో కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్ 2023 సీజన్‌లో పాల్గొంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. కారణం రెండేళ్లుగా గాయంతో బాధపడుతున్న ఆర్చర్‌కి ఇంగ్లాండ్ బోర్డు, ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ఇస్తుందా? అనేది అనుమానమే...

69

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున 20 వికెట్లు తీసిన జోఫ్రా ఆర్చర్, గాయంతో 2021 సీజన్ ఆడలేదు. 2022 సీజన్‌లో ఆడకుండానే వేలంలో రూ.8 కోట్లు దక్కించుకున్నాడు.. ఆర్చర్ ఈ సీజన్‌లో ఆడకపోతే ముంబై ఇండియన్స్ మరోసారి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు...

79

జోఫ్రా ఆర్చర్ కూడా దూరమైతే ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో జే రిచర్డ్‌సన్, డాన్ జాన్సన్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, హృతిక్ షోకీన్ వంటి ప్లేయర్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది.. వీళ్లు వికెట్లు తీయగలిగినా మ్యాచ్ విన్నర్లు అయితే కాదు... ఐపీఎల్ 2022 వేలంలో స్టార్లను కొనుగోలు చేయకుండా టైం పాస్ చేసిన ముంబై, ఆ సీజన్‌లో భారీ మూల్యం చెల్లించుకుంది...
 

89
Cameron Green

2023 మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌ని రూ.17 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అయితే ముంబై టీమ్ బ్యాక్‌ లక్ ఏంటో కానీ వేలం తర్వాత గ్రీన్ చేతికి గాయమైంది. అతను బౌలింగ్ చేసేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టం..

99
Jasprit Bumrah

ఐపీఎల్ 2023 మినీ వేలంలో జే రిచర్డ్‌సన్‌, పియూష్ చావ్లా, షామ్స్ ములానీ, విష్ణు వినోద్, డాన్ జాన్సన్, నెహాల్ వదేరా, రాఘవ్ గోయల్‌‌లను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. వీరిలో ఎవరు ముంబైకి మ్యాచ్ విన్నర్‌గా మారతారో చూడాలి..

click me!

Recommended Stories