కెఎల్ రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా రిషబ్ పంత్!... హంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్‌తో పాటు...

ఆసియా కప్ 2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై పెద్ద చర్చ జరిగింది. టెస్టుల్లో, వన్డేల్లో టీమిండియాకి మ్యాచ్ విన్నర్‌గా మారిన రిషబ్ పంత్, కొన్నాళ్లుగా టీ20ల్లో మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

Image credit: PTI

మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్ వరుసగా ఫెయిల్ అవుతుండడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతన్ని ఓపెనర్‌గా పంపించి ప్రయోగం చేసింది టీమిండియా. ఈ ప్రయోగం బాగానే వర్కవుట్ అయ్యింది. పంత్ టీ20 ఓపెనర్‌గానూ రాణించగలనని నిరూపించుకున్నాడు.

అయితే వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో రిషబ్ పంత్‌ని కాదని, సూర్యకుమార్ యాదవ్‌ని ఓపెనర్‌గా పంపించి, మరో ప్రయోగం చేసింది భారత జట్టు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఓపెనర్‌గా సక్సెస్ అయ్యాడు. అయితే ఈ ఇద్దరినీ కాదని ఇప్పుడు రెగ్యూలర్ ఓపెనర్ కెఎల్ రాహుల్‌ గాయం నుంచి కోలుకోవడంతో అతను తన ప్లేస్‌లోకి తిరిగి వచ్చాడు...


KL Rahul

గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న కెఎల్ రాహుల్, జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకుని తిరిగి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్నాక కరోనా బారిన పడిన కెఎల్ రాహుల్, జింబాబ్వే టూర్‌లో పెద్దగా రాణించలేదు...

KL Rahul

మొదటి వన్డేలో బ్యాటింగ్‌కి రాని కెఎల్ రాహుల్, రెండో వన్డేలో ఐదు బంతులు ఆడి ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. మూడో వన్డేలో 46 బంతులు ఆడి 30 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు కెఎల్ రాహుల్...

కెఎల్ రాహుల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు కాస్త సమయం పట్టేలా ఉంది. దీంతో అతని స్థానంలో రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ఆడించి, దినేశ్ కార్తీక్‌ని ఫినిషర్‌గా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు టీమిండియా అభిమానులు... 

KL Rahul

మరికొందరు మాత్రం కెఎల్ రాహుల్‌ని కొనసాగిస్తే, టీ20 వరల్డ్ కప్ సమయానికి అతను ఫామ్‌లోకి వస్తాడని అంటున్నారు..  టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్‌ని పక్కనబెట్టడం అంత తేలికయ్యే పని కాదని, క్లాస్ ప్లేయర్‌కి కొన్ని ఛాన్సులు ఇవ్వడంలో తప్పు లేదని అతనికి సపోర్ట్ చేస్తున్నారు... 

Latest Videos

click me!