లంకతో సిరీస్ తర్వాత ఐపీఎల్ లో రాణించినా దక్షిణాఫ్రికా సిరీస్ లో అవకాశం దక్కించుకోని సంజూ శాంసన్.. తిరిగి ఐర్లాండ్ తో సిరీస్ లో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఐర్లాండ్ తో సిరీస్ సందర్భంగా రెండో మ్యాచ్ లో శాంసన్ ను ఆడించారు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని అతడు రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు.