పదేళ్ల తర్వాత వన్డే టీమ్‌లోకి... అప్పటి టీమ్‌లో జడేజా ఒక్కడే! జయ్‌దేవ్ ఉనద్కట్ ఖాతాలో అరుదైన ఫీట్...

Published : Aug 02, 2023, 10:57 AM IST

దేశవాళీ టోర్నీల్లో ఇచ్చిన నిలకడైన ప్రదర్శన కారణంగా గత ఏడాది బంగ్లాదేశ్‌లో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు జయ్‌దేవ్ ఉనద్కట్... 12 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జయ్‌దేవ్ ఉనద్కట్, దాదాపు 10 ఏళ్ల తర్వాత వన్డే మ్యాచ్ ఆడాడు...  

PREV
15
పదేళ్ల తర్వాత వన్డే టీమ్‌లోకి... అప్పటి టీమ్‌లో జడేజా ఒక్కడే! జయ్‌దేవ్ ఉనద్కట్ ఖాతాలో అరుదైన ఫీట్...

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మొదటి రెండు వన్డేల్లో ఉమ్రాన్ మాలిక్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సిరాజ్ గాయంతో సిరీస్‌కి దూరం కావడం, ఉమ్రాన్ మాలిక్ విఫలం కావడంతో మూడో వన్డేలో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి అవకాశం దక్కింది..
 

25

ఈ మ్యాచ్‌కి ముందు చివరిగా 2013, ఆగస్టు 3న వన్డే వికెట్ తీసిన జయ్‌దేవ్ ఉనద్కట్, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో వికెట్లు తీయలేక టీమ్‌లో చోటు కోల్పోయాడు.. ఇప్పటిదాకా 7 వన్డేల్లో 8 వికెట్లు మాత్రమే తీసిన జయ్‌దేవ్ ఉనద్కట్, టీమిండియా తరుపున సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న ప్లేయర్‌గా నిలిచాడు..

35
Jaydev Unadkat

ఇంతకుముందు రాబిన్ సింగ్, 7 ఏళ్ల 230 రోజుల తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ ఇవ్వగా, అమిత్ మిశ్రా 6 ఏళ్ల 160 రోజులు, పార్థివ్ పటేల్ 6 ఏళ్ల 133 రోజులు, రాబిన్ ఊతప్ప 5 ఏళ్ల 344 రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. జయ్‌దేవ్ ఉనద్కట్ 9 ఏళ్ల 252 రోజుల తర్వాత వన్డేల్లో తిరిగి చోటు దక్కించుకుని, వీళ్లందరికంటే టాప్‌లో నిలిచాడు..

45
Jaydev Unadkat

2013 నవంబర్‌లో కొచ్చిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలతో పాటు జయ్‌దేవ్ ఉనద్కట్‌ని ఫాస్ట్ బౌలర్‌గా తీసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో ఆడిన భారత జట్టులో ఒక్క రవీంద్ర జడేజా మాత్రమే రీఎంట్రీ వన్డేలో ఆడడం విశేషం..

55
Jaydev Unadkat

ఈ మ్యాచ్‌కి ముందు జయ్‌దేవ్ ఉనద్కట్ ఆడిన ఆఖరి వన్డేలో ఆడిన యువరాజ్ సింగ్, సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికే రిటైర్ అవ్వగా శిఖర్ ధావన్ టీమ్‌లో చోటు కోల్పోయాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మూడో వన్డేలో విశ్రాంతి ఇవ్వగా అశ్విన్, భువీ, షమీలకు వెస్టిండీస్ టూర్‌లో చోటు దక్కలేదు.. 

click me!

Recommended Stories