సచిన్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడనే భయంతోనే కోహ్లీని ఆడించడం లేదా... విరాట్ ఫ్యాన్స్ వాదన...

Published : Aug 02, 2023, 11:37 AM IST

మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మంచి ఫామ్‌లోకి వచ్చాడు విరాట్ కోహ్లీ. ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి గడిచిన ఏడాది కాలంలో 6 అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండు సెంచరీలు బాదాడు...

PREV
18
సచిన్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడనే భయంతోనే కోహ్లీని ఆడించడం లేదా... విరాట్ ఫ్యాన్స్ వాదన...
Virat Kohli

వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 76వ అంతర్జాతీయ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి, వన్డే సిరీస్‌లో ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తొలి వన్డేలో లక్ష్యం మరీ చిన్నది కావడంతో విరాట్ కోహ్లీని బ్యాటింగ్‌కి పంపలేదు టీమిండియా...
 

28
Virat Kohli

రెండు, మూడో వన్డేలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. రెండో వన్డేలో ప్లేయర్ల కోసం డ్రింక్స్ తీసుకొచ్చిన విరాట్ కోహ్లీ, మూడో వన్డేలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు..
 

38

రోహిత్ శర్మకు రెస్ట్ తీసుకోవడం బాగా అలవాటే. గత ఏడాది టీమిండియాకి త్రీ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపిక అయినప్పటికీ రోహిత్ శర్మ ఆడిన మ్యాచుల కంటే ఆడని మ్యాచుల సంఖ్యే ఎక్కువ. రోహిత్ కారణంగా ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది..

48

అయితే విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడడు. అదీకాకుండా వెస్టిండీస్‌లో వన్డేల్లో చివరిగా సెంచరీ చేసిన భారత బ్యాటర్ విరాట్ కోహ్లీయే. రెండు, మూడో వన్డేలో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే రెండింట్లో కనీసం ఒక్క సెంచరీ అయినా వచ్చి ఉండేది..

58

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడిస్తూ ఫామ్‌ని నిలబెట్టుకోవాలని విరాట్ కోహ్లీ భావిస్తుంటే, టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అనవసర ప్రయోగాలతో అతనికి వరుసగా రెస్ట్ ఇస్తోంది...

68
Dravid and Rohit

దీంతో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఇద్దరినీ వెంటనే టీమ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ SACK ROVID (rohit+Dravid) ట్యాగ్‌ని దేశవ్యాప్తంగా ట్రెండ్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్... 

78

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ఉన్న ఆరేళ్ల కాలంలో విరాట్ కోహ్లీ కేవలం 6 మ్యాచులకు దూరం అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో, రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో ఏడాదిన్నరలో 18 మ్యాచులకు దూరమయ్యాడు విరాట్ కోహ్లీ...

88
Virat Kohli Rahul Dravid

500 మ్యాచుల్లో 76 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఇదే స్పీడ్‌ని కొనసాగిస్తే సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే ఫామ్‌లో ఉన్న కోహ్లీకి రెస్ట్ ఇచ్చి,సచిన్ రికార్డు బ్రేక్ కాకుండా రోహిత్, రాహుల్ అండ్ కో ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు విరాట్ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories