ఎంఎస్ ధోని బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యువరాజ్ సింగ్ లేదా సురేస్ రైనా?

First Published | Aug 25, 2024, 11:59 PM IST

MS Dhoni Best Friend : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి యువరాజ్ సింగ్, సురేష్ రైనా ఇద్దరితో సన్నిహిత స్నేహం ఉంది. మరి వీరిద్దరిలో ధోనికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తన జీవితంలో ధోని ఎవరికి ఎక్కువ స్థానం ఇచ్చాడు?

MS Dhoni Best Friend : క్రికెట్‌లో ఛాంపియన్ ప్లేయర్, టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. వికెట్ కీపర్‌గా, కెప్టెన్ గా భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. ప్రారంభంలో జట్టులో తన స్థానం గురించి కొంత సందిగ్దత ఉండేది కానీ, అతని దూకుడు బ్యాటింగ్ తన విలువను నిరూపించింది. దీంతో అతన్ని ఎవరూ ఆపలేకపోయారు.

డీఆర్ఎస్ వ్యూహాలు, ఆటగాళ్ల నిర్వహణ, ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పులతో పాటు జట్టు గెలుపు కోసం అతను చేసే పనులు క్రికెట్ పట్ల ధోనికి ఉన్న ప్రేమ, చురుకైన మనస్సు తెలియజేస్తున్నాయి. ధోని భారత్‌ను వన్డే ప్రపంచ కప్, టి20 ప్రపంచ కప్, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే స్థాయికి తీసుకెళ్లాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టును ముందుకు నడిపిస్తూ  ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టాడు.


ధోని బ్యాటింగ్ ప్రతిభ అద్వితీయం. టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై కూడా అద్భుతమైన ఆటతో దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాను సైతం ఆశ్చర్యపరిచాడు. అయితే,  క్రికెట్‌లో యువరాజ్ సింగ్ ధోనికి దగ్గర స్నేహితుడు. వారు అనేక మ్యాచ్‌లలో జట్టుకు కలిసి భారత్ కు విజయాలను అందించారు. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో యువరాజ్-ధోని ఇద్దరూ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

2008లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో యువరాజ్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా మోటార్‌బైక్ లభించింది. యువరాజ్ సింగ్-ధోని ఇద్దరూ మైదానంలో బైక్‌ను నడిపారు. చరిత్రలో గుర్తుంచుకునే క్రికెట్ క్షణాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఇద్దరు స్టార్ల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ, ధోని-యువరాజ్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి.

అయితే, వారి అనుబంధం మరే ఇతర ప్లేయర్ తో భర్తీ చేయలేనిదని చాలా దగ్గరి వారు చెబుతుంటారు. అలాగే, సురేష్ రైనాతో కూడా ధోనితో గొప్ప స్నేహ బంధాన్ని కలిగి ఉన్నాడు. వీరు చిన్ననాటి స్నేహితులు కూడా. రైనా 2005లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వీరిద్దరు భారత జట్టుతో పాటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కలిసి ఆడారు. 

ధోని మరియు సురేష్ రైనా

ధోని టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నప్పుడు, దాని గురించి ముందుగా తెలిసిన వ్యక్తి రైనా. మరో విషయం సురేష్ రైనా ద్వారానే ధోని తాను తండ్రి కాబోతున్నానని తెలుసుకున్నాడు. సాక్షి ముందుగా ఈ విషయాన్ని రైనాతో పంచుకుంది. అంటే ధోని కుటుంబంలో రైనా స్థానం ఎలాంటిదో ఈ విషయం తెలియజేస్తుంది. వన్డేల్లో ధోని-రైనాల భాగస్వామ్యం సగటు 62.14. ఇందులో 9 సెంచరీలు, 17 అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. 

Latest Videos

click me!