కెఎల్ రాహుల్ కంటే సూర్యకుమార్ యాదవ్ నయం... భారీ గ్యాప్‌ తర్వాత బరిలో దించడం తగదంటూ...

First Published Aug 7, 2022, 3:20 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో గాయపడిన కెఎల్ రాహుల్, ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముందు అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దాదాపు మూడు నెలల తర్వాత కెఎల్ రాహుల్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని అనుకుంటే కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు...

Image credit: PTI

కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో జింబాబ్వేలో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుందని భావించారు క్రికెట్ విశ్లేషకులు. భారీ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న కెఎల్ రాహుల్‌కి ఇది ప్రాక్టీస్‌గా పనికి వస్తుందని ఆశించారు. అయితే అలా కూడా జరగలేదు...

KL Rahul

దీంతో ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత నేరుగా ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడబోతున్నాడు కెఎల్ రాహుల్. కెఎల్ రాహుల్ గైర్హజరీలో భారత జట్టు... సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌, సంజూ శాంసన్, దీపక్ హుడాలను ఓపెనర్లుగా వాడింది...

ఇంగ్లాండ్‌ టూర్‌లో టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్ ఓపెనర్‌గా వస్తే, ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్... ఓపెనర్‌గా వ్యవహరిస్తూ సక్సెస్ అయ్యాడు...

ప్రస్తుతం టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా, దినేశ్ కార్తీక్ ఏడో స్థానంలో ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు కెఎల్ రాహుల్‌కి తుదిజట్టులో అవకాశం ఇవ్వాలంటే సూర్యకుమార్ యాదవ్‌ని తిరిగి నాలుగో స్థానానికి పంపి, దినేవ్ కార్తీక్‌ని జట్టు నుంచి తప్పించాల్సి ఉంటుంది...

‘కెఎల్ రాహుల్ ఏ స్థానంలో అయినా ఆడగల ప్లేయర్. వికెట్ కీపింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కళ్లు చెదిరే క్యాచులు కూడా అందుకోగలడు. అయితే గాయం తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు...

ఇప్పుడున్న పరిస్థితుల్లో కెఎల్ రాహుల్‌ని తుది జట్టులో ఆడించడం కంటే రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టడమే బెటర్. ఆసియా కప్ వంటి టోర్నీల్లో గ్యాప్ తర్వాత వస్తున్న కెఎల్ రాహుల్‌ని ఓపెనర్ పంపడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం...

K L Rahul

అతనికి కాస్త సమయం కావాలి. టీ20 వరల్డ్ కప్ 2022 వరకూ అతను ఎఓపెనింగ్ చేసేందుకు సిద్ధమయ్యేలా చేస్తే బెటర్... ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా...

click me!