కామన్వెల్త్ గేమ్స్ 2022: ఆస్ట్రేలియాతో ఫైనల్‌కి టీమిండియా రెఢీ... మన టీమ్‌లోని ప్లేయర్ల గురించి...

First Published Aug 7, 2022, 1:46 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళా జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించి మెడల్ ఖాయం చేసుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్, వరుస విజయాలతో సంచలనం క్రియేట్ చేసింది. అయితే భారత మహిళా జట్టులోని ప్లేయర్ల గురించి ఎంత మందికి తెలుసు... 

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్: మిథాలీ రాజ్ నుంచి మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ అందుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్, 2018 నుంచి టీ20 టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా (43 విజయాలు) ఎంఎస్ ధోనీ (41 విజయాలు) రికార్డునే బ్రేక్ చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలాగే హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అగ్రెసివ్ యాటిట్యూడ్‌నే విజయ మంత్రంగా ములుచుకుంది...

స్మృతి మంధాన: మహిళా క్రికెటర్లలో బీభత్సమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చుకుంది స్మృతి మంధాన. మంధానకి ఇంతటి క్రేజ్ రావడానికి ఆమె ఆటతో పాటు అందం కూడా ప్రధాన కారణం. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యధిక పరుగులు (153), అత్యధిక హాఫ్ సెంచరీలు (2), అత్యధిక ఫోర్లు (22), అత్యధిక సిక్సర్లు (6) బాదిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచింది టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన... 

షెఫాలీ వర్మ: 17 ఏళ్ల వయసులో టీమిండియాలోకి అడుగుపెట్టిన చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ. వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్‌లో బ్యాటింగ్ చేసే షెఫాలీ వర్మ, స్మృతి మంధానతో కలిసి ఓపెనింగ్ చేస్తుంది. 32 టీ20 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో 753 పరుగులు చేసిన షెఫాలీ వర్మ... భారత జట్టుకి కీ ప్లేయర్‌గా మారిపోయింది...

జెమీమా రోడ్రిగ్స్: పాకెట్ డైనమేట్‌గా పేరొందిన జెమీమా రోడ్రిగ్స్, చూడడానికి బక్కగా, చిన్నగా ఉన్నా... భారీ షాట్లు ఆడడంలో దిట్ట. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 31 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్, బర్బొడాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 6 ఫోర్లతో 56 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది...

దీప్తి శర్మ: భారత సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 4లో కొనసాగుతోంది. టీమిండియా తరుపున 61 టీ20 మ్యాచులు ఆడిన దీప్తి 520 పరుగులతో పాటు 63 వికెట్లు తీసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది దీప్తి...

Pooja Vastrakar

పూజా వస్త్రాకర్: టీమిండియాలోని మరో ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్. 27 టీ20 మ్యాచులు ఆడి 184 పరుగులు చేసి, 21 వికెట్లు తీసింది పూజా. కామన్వెల్త్‌కి ముందు కరోనా బారిన పడిన పూజా, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో డెత్ ఓవర్లలో 3 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చింది...

స్నేహ్ రాణా: 28 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్, ఐదేళ్ల బ్రేక్ తర్వాత 2021లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 18వ ఓవర్‌లో 3 పరుగులు, 20వ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి అదరగొట్టింది స్నేహ్ రాణా...

Taniya Bhatia

తానియా భాటియా: భారత మహిళా జట్టు వికెట్ కీపర్ తానియా భాటియా, భారత జట్టు తరుపున 50 టీ20 మ్యాచులు ఆడింది. 23 క్యాచులు, 44 స్టంపౌట్లు చేసిన తానియా భాటియా, భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది...

రాధా యాదవ్: భారత జట్టు ప్రధాన స్పిన్నర్ రాధా యాదవ్. భారత జట్టు తరుపున 40 టీ20 మ్యాచులు ఆడిన రాధా, 18.03 సగటుతో 52 వికెట్లు పడగొట్టింది...

మేఘనా సింగ్: కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ ద్వారానే అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసింది మేఘనా సింగ్. తొలి మ్యాచ్‌లో ఒకే వికెట్ తీసిన మేఘనా, మొత్తంగా నాలుగు మ్యాచుల్లో 3 వికెట్లు తీసింది...

రేణుకా సింగ్: కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియాకి ప్రధాన పేసర్‌గా మారింది రేణుకా సింగ్. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన రేణుకా సింగ్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ తీసింది. బార్బొడాస్‌తో మ్యాచ్‌లో 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన రేణుకా సింగ్... ఫైనల్‌లో కీ ప్లేయర్‌గా మారనుంది.

click me!