సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా అతడి వైపే మొగ్గుచూపుతున్న బీసీసీఐ..? అదే జరిగితే టాప్ ప్లేస్‌లో ముగ్గురూ కన్నడిగులే

First Published Dec 9, 2022, 12:58 PM IST

ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ తో సహా ఇతర పోస్టుల కోసం  బీసీసీఐ ఇటీవలే నామినేషన్లను స్వీకరించిన విషయం తెలిసిందే.  ఈ పోస్టుల కోసం బీసీసీఐ దాదాపు 200కు పైగా  దరఖాస్తులను స్వీకరించినట్టు తెలుస్తున్నది. 

చేతన్ శర్మ  సారథ్యంలోని  ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీని గతనెలలో బీసీసీఐ  వేటు వేసింది.  వీరి పదవీకాలం ముగింపునకు మరికొంత సమయమున్నా  భారత జట్టు టీ20 ప్రపంచకప్ లో ఓడిన తర్వాత  చేతన్ శర్మ అండ్ కో పై వేటు పడింది.   ఆ తర్వాత  చైర్మన్ తో సహా ఇతర పోస్టులకు దరఖాస్తులను స్వీకరించింది.  

ఈ నేపథ్యంలో కొత్త సెలక్షన్ కమిటీ చైర్మెన్ ఎవరుతారు.?? అని చర్చ సాగుతున్న క్రమంలో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు  వినిపిస్తున్నాయి.  నయాన్ మోంగియా,  మనీందర్ సింగ్, నిఖిల్ చోప్రాలు ఈ రేసులో ముందున్నారని వార్తలు వచ్చాయి.  

కానీ తాజా సమచారం ప్రకారం సెలక్షన్ కమిటీ చైర్మన్ గా కర్నాటకకు చెందిన  మాజీ  పేసర్ వెంకటేశ్ ప్రసాద్ పేరు ఖరారుచేయనున్నట్టు తెలుస్తున్నది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) కూడా  వెంకటేశ్ ప్రసాద్  అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నదని.. త్వరలోనే అతడి పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించనున్నట్టు  సమాచారం.  

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈనెల చివరివరకు  సెలక్షన్ కమిటీ చైర్మన్ తో పాటు ఇతర సభ్యుల పేర్లను ప్రకటిస్తాం.  చైర్మన్ రేసులో  టీమిండియా మాజీ  పేసర్  వెంకటేశ్ ప్రసాద్ ముందువరుసలో ఉన్నాడు. బహుశా అతడే ఈ పదవిని దక్కించుకోవచ్చు...’ అని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ తో తెలిపారు. 

ఒకవేళ  వెంకటేశ్ ప్రసాద్ గనక సెలక్షన్ చైర్మన్ పదవిని దక్కించుకుంటే   బీసీసీఐ టాప్ ప్లేస్ లో కర్నాటకకు చెందినవారే ముగ్గురు ఉండనున్నారు.  ప్రస్తుతం బీసీసీఐ చైర్మెన్ గా ఉన్న  రోజర్ బిన్నీ కర్నాటకకు చెందినవాడే.  టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ది కూడా ఈ రాష్ట్రమే. ఒకవేళ  సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎంపికైతే వెంకటేశ్ ప్రసాద్ కూడా అక్కడివాడే అవుతాడు.  

ఇదిలాఉండగా  సెలక్షన్ కమిటీలో  చైర్మన్ తో పాటు నలుగురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరిని టీ20 స్పెషలిస్టును తీసుకోవాలని  బీసీసీఐ భావిస్తున్నది. టీ20 లలో ఆడిన  అనుభవమున్న ఆటగాడిని  సెలక్షన్ కమిటీలో తీసుకుంటే అతడు.. ఈ ఫార్మాట్ కు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం దక్కుతుందని  ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా  అభిప్రాయపడుతున్న వేళ బీసీసీఐ కూడా ఆ దిశగా  అడుగులు వేస్తున్నది. 

click me!