సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ గెలిచిన విరాట్ కోహ్లీని తప్పించి, ఆ బాధ్యతను కెఎల్ రాహుల్‌కి (రోహిత్ శర్మ గాయపడడంతో) అప్పగించింది బీసీసీఐ. అయితే కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా టూర్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన భారత జట్టు, వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది...
కెప్టెన్‌గా వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి చవిచూసిన కెఎల్ రాహుల్, భారత జట్టుకి సౌతాఫ్రికా గడ్డపైన మొట్టమొదటి వైట్ వాష్‌ను కానుకగా ఇచ్చాడు...
210
తాజాగా సౌతాఫ్రికా పర్యటనకి వెళ్లిన బంగ్లాదేశ్, సఫారీ గడ్డపై సఫారీ టీమ్‌ను 2-1 తేడాతో ఓడించి... వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాలో ఏ ఫార్మాట్‌లో అయిన బంగ్లాదేశ్‌కి దక్కిన మొట్టమొదటి విజయాలివే...
310
తొలి వన్డేలో సౌతాఫ్రికాను ఆలౌట్ చేసి 38 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడింది. అయితే మూడో వన్డేలో ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చి 9 వికెట్ల తేడాతో సఫారీ టీమ్‌ను ఓడించింది బంగ్లా...
410
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 37 ఓవర్లలో 154 పరుగులకి ఆలౌట్ అయ్యింది. జాన్నేమన్ మలాన్ 39 పరుగులు చేయగా కేశవ్ మహరాజ్ 28, ప్రిటోరియస్ 20 , డేవిడ్ మిల్లర్ 16, క్వింటన్ డి కాక్ 12 పరుగులు చేశారు...
510
మిగిలిన సఫారీ బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు. బంగ్లా యంగ్ బౌలర్ టస్కీన్ అహ్మద్ 9 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లుపడగొట్టి, సఫారీ టీమ్ పతనాన్ని శాసించాడు...
610
155 పరుగుల టార్గెట్‌ను 26.3 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి ఛేదించింది బంగ్లాదేశ్. తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్ కలిసి తొలి వికెట్‌కి 127 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
710
లిటన్ దాస్ 57 బంతుల్లో 8 ఫోర్లతో 48 పరుగులు చేయగా తమీమ్ ఇక్బాల్ 82 బంతుల్లో 14 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. షకీబ్ అల్ హసన్ 20 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి బంగ్లాకి విజయాన్ని అందించాడు.
810
సౌతాఫ్రికాలో బంగ్లాదేశ్ జట్టు సాధించిన విజయంతో కెఎల్ రాహుల్‌పై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. క్రికెట్‌లో పసి కూనగా పేరొందిన బంగ్లా చేసిన పని, టాప్ క్లాస్ ప్లేయర్లతో నిండిన టీమిండియా చేయలేకపోయిందంటే దానికి కెఎల్ రాహుల్ కెప్టెన్సీయే కారణమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
910
బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అటు బ్యాటింగ్‌లో, కెప్టెన్సీలో సత్తా చాటితే... టాప్ ప్లేయర్లను టీమ్‌లో ఉంచుకుని వారిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా కెఎల్ రాహుల్‌కి తెలియలేదని ట్రోలింగ్ చేస్తున్నారు అభిమానులు...
1010
బీసీసీఐ పెద్దలు చెప్పినట్టుగా భవిష్యత్తులో కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అప్పగిస్తే, బంగ్లాదేశ్ చేతుల్లో వైట్ వాష్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...