Top 8 Fittest Cricketers: క్రికెట్ లో రాణించాలంటే నాలుగు భారీ షాట్లు కొడితే సరిపోదు. ఒకప్పుడంటే బ్యాటర్ బ్యాటింగ్ కు, బౌలర్ బౌలింగ్ కే పరిమితమయ్యేవాడు. ఇప్పుడలా కాదు.. మైదానంలో పాదరసంలా కదలాలి. బౌండరీ వద్దకు పరుగులు పెట్టే బంతి వెనుక చిరుత పులిలా పరిగెత్తాలి. అలా చేయాలంటే ఫిట్నెస్ తప్పనిసరి మరి..
ఒక ఆటగాడి సామర్థ్యాన్ని తెలిపే యో యో టెస్టును ఇప్పుడు క్రికెట్ లోనే గాక అన్ని క్రీడల్లో వాడుతున్నారు. ఇది ఒకరకమైన ఎరోబిక్ ఎక్సర్ సైజ్. ఇక క్రికెట్ లో తీసుకుంటే ఆటగాళ్ల స్టామినా, వేగం, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ టెస్టును నిర్వహిస్తారు.
210
ఇటీవల కాలంలో జాతీయ క్రికెట్ అకాడమీలో పలువురు ఆటగాళ్లకు యో యో టెస్టు నిర్వహించగా అందులో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా ఫెయిల్ అవగా.. గుజరాత్ టైటాన్స్ సారథి హార్థిక్ పాండ్యా పాసవ్వడమే గాక మెరుగైన స్కోరు సాధించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లలో ఫిట్ గా ఉన్న పలువురు ఆటగాళ్ల జాబితాను చూద్దాం.
310
1. రిషభ్ పంత్ : ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ యో యో స్కోరు 17.2 గా ఉంది. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లకు వికెట్ కీపర్ గా ఉన్న పంత్ దూకుడుగా ఆడటంలో దిట్ట. మిగతా క్రికెటర్లతో పోలిస్తే హైట్ కొంచెం తక్కువగా ఉన్నా ఫిట్నెస్ విషయంలో మాత్రం ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు అదరగొడుతున్నాడు.
410
2. రవీంద్ర జడేజా : టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా యో యో స్కోరు 19. మైదానంలో బంతి, బ్యాట్ తో పాటు ఫీల్డింగ్ లో పాదరసంలా కదిలే జడ్డూ.. ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. జడేజా దగ్గరికి బంతి వస్తే అతడిని దాటిపోయిన సందర్భాలు చాలా అరుదు.
510
3. హార్థిక్ పాండ్యా : గుజరాత్ టైటాన్స్ సారథి హార్థిక్ పాండ్యా యో యో స్కోరు కూడా 19 గా ఉంది. ఆల్ రౌండర్ అయిన పాండ్యా.. ఫీల్డింగ్ లో కూడా మెరుపులు మెరిపిస్తాడు. టీమిండియా మాజీ సారథి కోహ్లి మాదిరిగానే ఫిట్నెస్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే ఆటగాళ్లలో పాండ్యా ఒకడు.
610
4. విరాట్ కోహ్లి : టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2012 నుంచి భారత జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్న కోహ్లి యో యో స్కోరు 19. కోహ్లి ఒక్కడే కాదు.. ఈ విషయంలో అతడు జట్టు దృక్పథాన్ని కూడా మార్చాడు.
710
5. మనీష్ పాండే : విరాట్ కోహ్లి ఫిట్నెస్ లెవల్స్ పీక్స్ అనుకుంటే అంతకుమించిన ఫిట్నెస్ ను కలిగి ఉన్నాడు మరో భారత ఆటగాడు మనీష్ పాండే. జాతీయ జట్టులో పెద్దగా మెరవకపోయినా దేశవాళీలో మాత్రం ఇరగదీసే పాండే యో యో టెస్టులో 19.2 స్కోరు సాధించడం గమనార్హం.
810
6. కగిసొ రబాడా : దక్షిణాఫ్రికా బౌలర్ రబాడా కూడా పాండే మాదిరిగా యో యో స్కోరు 19.2 సాధించాడు. ప్రత్యర్థి జట్టులో బ్యాటర్ తో సంబంధం లేకుండా రఫ్ఫాడించే రబాడా.. ఫిట్నెస్ ను మెయింటెన్ చేయడంలో దిట్ట.
910
7. మహేశ్ తీక్షణ : శ్రీలంకకు చెందిన తీక్షణ గతంలో అండర్-19 ప్రపంచకప్ లో బరువు ఎక్కువున్నాడని రిజెక్ట్ అయ్యాడు. కానీ మూడేండ్ల తర్వాత అతడు బరువు తగ్గడమే కాదు జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన తీక్షణ.. యో యో టెస్టులో భాగంగా రెండు కిలోమీటర్ల పరుగును 8.28 నిమిషాల్లోనే పూర్తి చేశాడు. 2020లో అతడి యో యో స్కోరు 16.1 గా ఉండగా.. ఈ ఏడాది అది 19.2 గా ఉంది. ఈ సీజన్ లో అతడు సీఎస్కే తరఫున ఆడనున్నాడు.
1010
8. జానీ బెయిర్ స్టో : ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టో ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. యో యో టెస్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చేసిన స్కోరు 21.8 గా ఉంది.