ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో రాహుల్ 58 పరుగులు వద్ద ఉన్న సమయంలో హ్యారీ బ్రుక్ అతని క్యాచ్‌ను వదిలాడు. జోష్ టంగ్ వేసిన షార్ట్ బాల్‌ను థర్డ్ మ్యాన్ వైపు గైడ్ చేసిన రాహుల్‌కు, బ్రుక్ క్యాచ్ డ్రాప్ చేయడంతో మరో అవకాశం లభించింది. అదే అవకాశాన్ని ఉపయోగించుకుని సెంచరీ చేశాడు.
సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సెనా) దేశాల్లో టెస్ట్ ఓపెనర్‌గా 50+ స్కోర్లు ఎక్కువ చేయడంలో రాహుల్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నాడు. ఆయనతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్ కూడా ఉన్నారు. వీరి కంటే ముందు టాప్ లో సునీల్ గవాస్కర్ ఉన్నారు.
కేఎల్ రాహుల్ టెస్ట్ కెరీర్ గణాంకాలు గమనిస్తే.. ఇప్పటివరకు 59 టెస్టులు ఆడి, 3,350కి పైగా పరుగులు సాధించాడు. టెస్టుల్లో రాహుల్ 9 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు, సునీల్ గవాస్కర్ "కేఎల్ రాహుల్ ఒక పూర్తి జట్టు వ్యక్తి" అని వ్యాఖ్యానించాడు. సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "తన సామర్థ్యం రాహుల్‌కి కూడా అర్థం కాలేకపోవచ్చు. ఈ సిరీస్ అతని ప్రస్థానంలో మైలురాయిగా నిలవొచ్చు" అని అన్నారు. అందుకు దగ్గట్టుగానే కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటతో రాణిస్తున్నాడు.