ఇండియా రెండవ కొత్త బంతిని వెంటనే తీసుకుంది. బుమ్రా ప్రారంభించారు. వోక్స్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. బ్రూక్ సిరాజ్ బౌలింగ్ లో తనదైన స్టైల్లో ఎదుర్కొన్నాడు. డౌన్ ది గ్రౌండ్, కవర్‌ల మీదుగా ఫోర్లు కొట్టాడు. ఈ సమయంలో బ్రూక్ బ్యాట్ ఎడ్జ్ చేయగా, గల్లీలో ఉన్న యశస్వీ జైస్వాల్ సులువు క్యాచ్‌ను వదిలేశాడు.
90ల్లోకి ప్రవేశించిన బ్రూక్, సిరాజ్ బౌలింగ్‌ను సిక్సర్‌తో సెంచరీకి చేరువయ్యాడు. లంచ్ తర్వాత 9 ఓవర్లలో ఏకంగా 67 పరుగులు వచ్చాయి.
బ్రూక్ ఔట్ అయినా.. స్కోర్ బోర్డు పరుగులు ఆగలేదు
డ్రింక్స్ తర్వాత వోక్స్ బుమ్రా బౌలింగ్‌లో ఆఫ్ డ్రైవ్‌తో ఫోర్ కొట్టాడు. ప్రసిద్ధ్ తిరిగి వచ్చి, బ్రూక్‌ను షార్ట్ బాల్‌కు ట్రాప్ చేసి 99 పరుగుల వద్ద ఔట్ చేశాడు. దీంతో హ్యారీ బ్రూక్ కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీని కోల్పోయాడు. హ్యారీ బ్రూక్ తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. వోక్స్ మరో ఫోర్ తో ఇంగ్లాండ్‌ను 400 పరుగుల మార్క్ దాటించాడు. కార్స్ కూడా స్ట్రీకి షాట్లతో బౌండరీలు సాధించాడు.
వోక్స్ మరో సిక్సర్, థర్డ్‌మాన్ మీదుగా ఫోర్ కొట్టి సిరాజ్‌పై ఒత్తిడిని పెంచాడు. కార్స్‌తో కలిసి 36 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వోక్స్ 38 పరుగులు, కార్స్ 22 పరులు చేసి అవుట్ అయ్యారు.