క్రికెటర్ రాహుల్ బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్ ఎ లో ఉన్నారు, దీని ద్వారా ఆయనకు ఏడాదికి రూ.5 కోట్లు లభిస్తాయి. అలాగే యాడ్స్, ఇతర మార్గాల ద్వారా కూడా రాహుల్ కు ఆదాయం వస్తుంది. దీంతో అతడు లగ్జరీ జీవితం గడుపుతున్నాడు.
రాహుల్ వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి... వాటిలో తిరగడం అతడికి చాలా ఇష్టం. ఆయన వద్ద అద్భుతమైన కార్ల సేకరణ ఉంది. ఇలా కెఎల్ రాహుల్ వద్ద లంబోర్ఘిని, బిఎండబ్ల్యు 5 సిరీస్, ఆస్టన్ మార్టిన్ డిబి11, మెర్సిడెస్ బెంజ్ సి43 ఉన్నాయి. ఈ కార్ల ధర చాలా ఎక్కువ.