3 ఓవర్లలో 4 వికెట్లు... వరల్డ్ కప్‌లో దీపక్ హుడాతో బౌలింగ్ వేయించి ఉన్నా పోయేదిగా...

First Published Nov 20, 2022, 4:50 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాని వెంటాడిన సమస్య బౌలింగ్. వరల్డ్ కప్‌లోనే కాదు, అంతకముందు ఆసియా కప్ టోర్నీలోనూ భారత బౌలర్ల ఫెయిల్యూర్ కారణంగానే టీమిండియా ఫైనల్ చేరలేకపోయింది. పొట్టి ప్రపంచకప్ సెమీస్ పరాజయం తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది టీమిండియా...

surya kumar

మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మౌంట్ మౌంగనుయ్‌లో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 65 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కారణంగా 191 పరుగుల భారీ స్కోరు చేసింది...

Time Southee

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన టిమ్ సౌథీ, వరుస బంతుల్లో హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఒకే టీ20 మ్యాచ్‌లో సెంచరీ, హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే మొట్టమొదటిసారి...

Image credit: Getty

192 పరుగుల లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ జట్టు 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఫిన్ ఆలెన్‌ని భువీ అవుట్ చేయగా కెప్టెన్ కేన్ విలియంసన్ 52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఒంటరిపోరాటం చేశాడు..

బ్యాటింగ్‌లో డకౌట్ అయిన దీపక్ హుడా, బౌలింగ్‌లో మాత్రం హ్యాట్రిక్ తీసే ఛాన్స్‌ని తృటిలో మిస్ అయ్యాడు. మొదటి ఓవర్‌లో 6 పరుగులు ఇచ్చిన దీపక్ హుడా, తన రెండో ఓవర్‌లో 3 పరుగులిచ్చి డేంజరస్ బ్యాటర్ డార్ల్ మిచెల్‌ని పెవిలియన్ చేర్చాడు. 

కొన్నాళ్లుగా టీమిండియాని వేధిస్తున్న ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో బంతిని అందుకున్న హుడా... ఇష్ సోధీ, టిమ్ సౌథీలను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి లూకీ ఫర్గూసన్ సింగిల్ తీయగా ఐదో బంతికి మిల్నేని అవుట్ చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కి తెరదించాడు దీపక్ హుడా...

2.5 ఓవర్లలో 10 పరుగులిచ్చిన దీపక్ హుడా, 4 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌పై టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు దీపక్ హుడా. వరల్డ్ కప్‌కి ఎంపికైన దీపక్ హుడా, ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో తిరిగి అవకాశం దక్కించుకోలేకపోయాడు..

ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఒక్క వికెట్ కూడా తీయలేక 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీపక్ హుడా లాంటి పార్ట్ టైమ్ బౌలర్‌ని ఆడించి ఉన్నా, టీమిండియాకి ఈ ఘోర పరాజయం తప్పి ఉండేదని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు...

Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన యజ్వేంద్ర చాహాల్, 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. వరల్డ్ కప్‌కి రిజర్వు ప్లేయర్‌గా ఎంపికైన మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు...

జట్టులో అస్త్రాలన్నీ సంధించడానికి సిద్ధంగా ఉన్నా, టీమిండియా వాటిని చేతకాని వాటిగా పరిగణించి... పక్కనబెట్టి భారీ మూల్యం చెల్లించుకుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. వరల్డ్ కప్ ఆడిన భువీ ఓ వికెట్ తీయగా అర్ష్‌దీప్ సింగ్ 3 ఓవర్లలో 29 పరుగలిచ్చి వికెట్ తీయలేకపోవడం కొసమెరుపు...

click me!