ఐపీఎల్ 2025లో మెరుపులు మెరిపిస్తున్న కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో కెఎల్ రాహుల్ అద్భుతమైన ఆటతో పరుగులు వరదపారిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌ను మిస్ అయినప్పటికీ, ఆ తర్వాతి నుంచి మంచి ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు.
ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లలో 59.50 అద్భుతమైన సగటుతో 238 పరుగులు చేశాడు. ఆర్‌సీబీపై అతను 93 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 154.54గా ఉంది.