IPL: ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఎంత కరెంట్ ఖర్చవుతుందో తెలుసా? షాకింగ్ ఫ్యాక్ట్స్!

Published : Apr 18, 2025, 04:43 PM IST

IPL Match Power Facts: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి బంతికీ థ్రిల్, ప్రతి షాట్‌కీ హోరు, ప్రతి స్టేడియంలో జిగేల్ మనే లైట్లు.. ఇలా చాలానే ఉన్నాయి. అయితే, ఒక  ఐపీఎల్ మ్యాచ్‌లో ఎంత కరెంటు ఖర్చవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయాలు ఇప్పుడు మిమ్మల్ని తప్పకుండా షాక్ చేస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
IPL: ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఎంత కరెంట్ ఖర్చవుతుందో తెలుసా? షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లు సాయంత్రం నుండి రాత్రి వరకు జరుగుతాయి. రాత్రి మ్యాచ్‌లలో స్టేడియం లైటింగ్, LED స్క్రీన్లు, కామెంటరీ బాక్స్, కెమెరా సిస్టమ్, బ్రాడ్‌కాస్టింగ్ సెటప్, మ్యూజిక్, ప్రేక్షకుల సౌకర్యాల కోసం కరెంట్ ను ఉపయోగిస్తారు. 

25
IPL ఒక మ్యాచ్‌లో సగటున ఎంత కరెంటు వాడతారు?

పలు మీడియా నివేదికల ప్రకారం.. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో సుమారు 20,000 నుండి 30,000 యూనిట్ల కరెంటు ఖర్చవుతుంది. పెద్ద ప్లేఆఫ్ లేదా ఫైనల్‌ మ్యాచ్ ల సమయంలో ఇది 50,000 యూనిట్లకు చేరుకుంటుంది.

35

ఐపీఎల్ షూటింగ్‌లో డజన్ల కొద్దీ హై-పవర్ కెమెరాలు, డ్రోన్లు, సౌండ్ సిస్టమ్స్, బ్రాడ్‌కాస్టింగ్ వ్యాన్లు, లైవ్ స్ట్రీమింగ్ సెటప్‌లు ఉపయోగిస్తారు. లైవ్ టెలికాస్టింగ్‌లోనే 2,000 నుండి 5,000 యూనిట్ల కరెంటు ఖర్చవుతుంది.

45

స్టేడియం బయట పార్కింగ్ ఏరియా లైటింగ్, VIP లాంజ్, ఫుడ్ కోర్ట్, సెక్యూరిటీ, పోలీస్ కంట్రోల్ రూమ్, మొబైల్ టవర్, నెట్‌వర్క్ బూస్టర్‌ల సేవల కోసం మ్యాచ్ సమయంలో కరెంట్ ను వాడతారు.

55
IPLలో గ్రీన్ ఎనర్జీ

ప్రతి IPL జట్టు, నిర్వాహకులు ఇప్పుడు గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతున్నారు. కొన్ని స్టేడియంలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. LED లైటింగ్ ద్వారా కరెంటు ఆదా చేస్తున్నారు. కార్బన్ ఆఫ్‌సెట్ ప్లానింగ్ ద్వారా కరెంటు వృధా ప్రభావాన్ని తగ్గిస్తున్నారు. BCCI, ఫ్రాంచైజీలు సస్టైనబుల్ ఈవెంట్స్ వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రతి డాట్ బాల్‌కీ ఒక చెట్టు నాటే కార్యక్రమం కూడా చేపట్టారు.

Read more Photos on
click me!

Recommended Stories