KL Rahul Love Story: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, నటి అథియా శెట్టి లవ్ స్టోరీ మీకు తెలుసా? బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ నుంచి ఖండాలా పెళ్లి వరకు సాగిన ప్రయాణం.. వీరిద్దరి చదువు, వివాహం, ఆస్తుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సునీల్ శెట్టి కూతురితో టీమిండియా స్టార్ ప్రేమ ప్రయాణం.. ఆస్తి ఎంతో తెలిస్తే షాకే
టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు, నటి అథియా శెట్టిల బంధం స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కన్నడిగుడైన కేఎల్ రాహుల్, అథియా శెట్టి మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు, వారి సంబంధం పెళ్లి వరకు ఎలా సాగింది, వారి చదువు, ఆస్తుల వివరాలు ఇప్పుడు వివరంగా చూద్దాం.
26
బెంగళూరులో మొదలైన సీక్రెట్ లవ్ స్టోరీ
కేఎల్ రాహుల్ (కణ్ణూర్ లోకేష్ రాహుల్) కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన కుటుంబం మంగళూరు ప్రాంతానికి చెందినది. వీరిద్దరి ప్రేమకథ 2019 ప్రారంభంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో మొదలైంది. వీరిద్ధరికీ తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. మొదటి భేటీలోనే ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలవడంతో మంచి స్నేహితులుగా మారారు. అయితే తమ లవ్ మేటర్ బయటకు రాకుండా చాలా కాలం పాటు మీడియా కంటికి చిక్కకుండా సీక్రెట్‌గా ఉంచారు.
36
రూమర్లు నుంచి అఫీషియల్ పోస్ట్ వరకు
వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ చేసిన ఒక కామెంట్ ద్వారా మొదట బయటకు వచ్చాయి. అథియా సోషల్ మీడియా పోస్ట్‌పై ఆయన సరదాగా కామెంట్ చేయడంతో అభిమానులు అనుమానించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా పిక్స్ ఆధారంగా నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేశారు. చివరకు 2021లో అథియా బర్త్‌డే సందర్భంగా కేఎల్ రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రొమాంటిక్ పిక్ షేర్ చేస్తూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు.
ప్రేమను ఒప్పుకున్న తర్వాత అథియా, కేఎల్ రాహుల్ ఆందోళన లేకుండా జంటగా కనిపించడం మొదలుపెట్టారు. రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ టూర్లకు అథియా వెళ్లేది. ఇద్దరూ కలిసి కొన్ని బ్రాండ్ ప్రకటనల్లో కూడా నటించారు. అథియా సోదరుడు అహాన్ శెట్టి నటించిన 'తడప్' సినిమా ప్రీమియర్ షోకు రాహుల్ హాజరై శెట్టి ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యారు. చివరికి జనవరి 23, 2023న మహారాష్ట్రలోని ఖండాలాలో ఉన్న సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు వివాహబంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత మార్చి 2025లో ఈ దంపతులు ఒక ముద్దుల పాపకు జన్మనిచ్చారు.
56
కేఎల్ రాహుల్, అథియా శెట్టిలు ఏం చదువుకున్నారు?
క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన కేఎల్ రాహుల్ చదువులోనూ ముందున్నారు. సూరత్కల్‌లోని ఎన్‌ఐటీకే (NITK) ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పాఠశాల విద్యను, మంగళూరులోని సెయింట్ అలోసియస్ కాలేజీలో పియుసి (PUC) పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని జైన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీ పట్టా పొందారు.
అటు అథియా శెట్టి ముంబైలోని ప్రముఖ ది కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలలో చదువుకున్నారు. అనంతరం అమెరికాలోని ప్రసిద్ధ 'న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ' (NYFA) నుంచి ఫిల్మ్‌మేకింగ్ అండ్ లిబరల్ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు.
66
ఇద్దరి నెట్ వర్త్ ఎంతంటే?
క్రికెట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కేఎల్ రాహుల్ భారీగానే ఆర్జించారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, ఐపీఎల్ శాలరీ, ప్రముఖ బ్రాండ్ల ప్రచారాల ద్వారా కేఎల్ రాహుల్ మొత్తం ఆస్తి విలువ దాదాపు ₹101 కోట్లుగా అంచనా.
ఇక అథియా శెట్టి సినిమాలతో పాటు ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్‌లు, డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా సంపాదిస్తున్నారు. ఆమె నికర ఆస్తి విలువ సుమారు ₹30 కోట్ల నుంచి ₹45 కోట్ల వరకు ఉంటుంది.