Yashasvi Jaiswal: రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ గుడ్ బై? హార్దిక్ పాండ్యాతో బిగ్ ట్రేడ్ డీల్ నిజమేనా?

Published : Aug 17, 2026, 08:39 AM IST

Yashasvi Jaiswal: ఐపీఎల్ 2027కు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి యశస్వి జైస్వాల్ అవుట్ అవుతున్నాడనే వార్తలు వైరల్ గా మారాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో బిగ్ ట్రేడ్ చర్చలు నడుస్తున్నాయి. వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
రాజస్థాన్ నుంచి జైస్వాల్ అవుట్? ముంబై ఇండియన్స్‌లోకి ఎంట్రీ!

ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే లీగ్‌లో ఒక భారీ సంచలనం నమోదు కాబోతోంది. టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్‌ను వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జైస్వాల్‌ను వేరే టీమ్‌కు ట్రేడ్ చేయడానికి లేదా పూర్తిగా రిలీజ్ చేయడానికి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు రిపోర్టులు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో జైస్వాల్‌ను ఎక్స్ఛేంజ్ చేసే దిశగా పెద్ద చర్చలు జరుగుతుండటం క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

26
జైస్వాల్‌పై మేనేజ్‌మెంట్ అసంతృప్తి

యశస్వి జైస్వాల్ ప్రవర్తన, ఆటిట్యూడ్‌ పట్ల రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అస్సలు సంతృప్తిగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మైదానంలో అతని ప్రదర్శన మాత్రమే కాకుండా, జట్టులోని అంతర్గత పరిస్థితులు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సంజూ శాంసన్ సీఎస్కేకు ట్రేడ్ అయ్యాక, జైస్వాల్‌కు కప్టెన్సీ ఇస్తారని అందరూ అనుకున్నారు.

కానీ ఫ్రాంచైజీ రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. జైస్వాల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, మే 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ అందుబాటులో లేకపోవడంతో జైస్వాల్ జట్టును నడిపించాడు. అయితే మేనేజ్‌మెంట్‌తో ఏర్పడిన విభేదాలు అతని భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి.

36
వైభవ్ సూర్యవంశీ జోరు.. మారిన సమీకరణాలు

బీహార్‌కు చెందిన 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌తో దూసుకుపోవడం కూడా జైస్వాల్‌కు పెద్ద మైనస్‌గా మారింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచుల్లో 237.30 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 రన్స్ సాధించాడు. ఆరెంజ్ క్యాప్, సూపర్ సిక్సెస్, సూపర్ స్ట్రైకర్ అవార్డులను కైవసం చేసుకుని రాజస్థాన్ రాయల్స్ పోస్టర్ బాయ్‌గా మారాడు.

టాప్ ఆర్డర్‌లో నమ్మకమైన భారత ఓపెనర్‌గా వైభవ్ నిలదొక్కుకోవడంతో, జైస్వాల్‌ను పక్కన పెట్టడం రాజస్థాన్‌కు పెద్ద కష్టమేమీ కాదని ఫ్రాంచైజీ భావిస్తోంది. అదే సమయంలో జైస్వాల్ 2026 సీజన్ 16 మ్యాచుల్లో 30.50 సగటుతో 427 రన్స్ మాత్రమే చేశాడు. అతని హయ్యెస్ట్ స్కోరు 77 నాటౌట్ కాగా, కేవలం 3 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు.

46
ముంబై ఇండియన్స్‌తో ట్రేడ్ రూమర్స్

జూన్ 19 నుండి జూన్ 22 మధ్య కాలంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక బిగ్ ట్రేడ్ చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీని ప్రకారం హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్‌కు, యశస్వి జైస్వాల్ ముంబై ఇండియన్స్‌కు మారే అవకాశం ఉంది. డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబైకి ఆడే జైస్వాల్‌ను తమ సెటప్‌లోకి తెచ్చుకోవడానికి ముంబై ఇండియన్స్ ఆసక్తి చూపిస్తోంది.

రాజస్థాన్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరం తీవ్రంగా ఉంది. గతంలో సంజూ శాంసన్ ను ఇచ్చి సామ్ కరన్, రవీంద్ర జడేజాలను తీసుకున్నప్పటికీ, కరన్ గాయం వల్ల ఆడలేకపోయాడు. అందుకే పాండ్యా వస్తే జట్టు బ్యాలెన్స్ అవుతుందని రాజస్థాన్ భావిస్తోంది.

56
కన్ఫర్మేషన్ లేదు.. నిబంధనలు ఏం చెప్తున్నాయి?

అయితే, ఇప్పటివరకు ఈ ట్రేడ్ ఒప్పందంపై రాజస్థాన్ రాయల్స్ కానీ, ముంబై ఇండియన్స్ కానీ, లేదా ఐపీఎల్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడినైనా ట్రేడ్ చేయాలంటే సదరు ప్లేయర్ అంగీకారం తప్పనిసరి.

జైస్వాల్ ఈ డీల్‌కు ఓకే చెప్పాడా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు హార్దిక్ పాండ్యాకు రాజస్థాన్ కెప్టెన్సీ ఇచ్చేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేదు, ఇది డీల్‌కు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అలాగే హార్దిక్ కోసం సీఎస్కే, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేసులో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

66
ఐపీఎల్ జైస్వాల్ సూపర్ ట్రాక్ రికార్డు

యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తంగా 83 మ్యాచ్‌లు ఆడి 2593 పరుగులు చేశాడు. ఇందులో అతని బ్యాటింగ్ సగటు 33.67 కాగా, 152.79 స్ట్రైక్ రేట్‌తో నిలకడగా పరుగులు రాబట్టాడు. తన కెరీర్‌లో 18 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన ఘనత కూడా జైస్వాల్ సొంతం. 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై కేవలం 13 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ బాది ఈ రికార్డును నెలకొల్పాడు.

Read more Photos on
click me!

Recommended Stories