IPL 2022: ఏం పర్లేదు..! బాగా ఆడారు.. తలెత్తుకోండి : కేకేఆర్ కు బాలీవుడ్ బాద్షా మోటివేషనల్ ట్వీట్

Published : Apr 19, 2022, 05:07 PM IST

TATA IPL 2022: ఐపీఎల్-15 లో భాగంగా సోమవారం రాత్రి  రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిన కోల్కతా నైట్ రైడర్స్  ఆటగాళ్లు  నిరాశ చెందాల్సిందేమీ లేదని అన్నాడు ఆ జట్టు యజమాని షారుఖ్ ఖాన్.. 

PREV
17
IPL 2022: ఏం పర్లేదు..! బాగా ఆడారు.. తలెత్తుకోండి :  కేకేఆర్ కు బాలీవుడ్ బాద్షా మోటివేషనల్ ట్వీట్

రాజస్తాన్ రాయల్స్ చేతిలో  ఏడు పరుగుల తేడాతో ఓడిన కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు  ఆ జట్టు యజమాని, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు.  

27

మ్యాచ్ ఓడినంత మాత్రానా పోయిందేమీ లేదని, గొప్ప పోరాటం కనబరిచారని కింగ్ ఖాన్ ట్వీట్ లో వెల్లడించాడు.  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ ఆరోన్ ఫించ్,  సునీల్ నరైన్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్  లను ప్రత్యేకంగా అభినందించాడు. 

37

సోమవారం మ్యాచ్ ముగిశాక షారుక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ‘చాలా భాగా ఆడారు బాయ్స్. శ్రేయస్ అయ్యర్, ఆరోన్ ఫించ్, ఉమేశ్ యాదవ్  అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఐపీఎల్ లో 150వ  మ్యాచ్ ఆడిన సునీల్ నరైన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. 

47

పదిహేనేళ్ల క్రితం సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్.. నువ్వొక అద్భుతం. మనం ఈ  మ్యాచ్ లో ఓడిపోయాం.  కింద పడ్డప్పుడే మరింత పట్టుదలగా ఆడగలం.  తలెత్తుకోండి..’  అని ట్వీట్ చేశాడు. 

57

సోమవారం నాటి  మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు  చేసింది.  రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్ (103) సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (38), హెట్మెయర్ (26 నాటౌట్) ధాటిగా ఆడారు. 

67

ఇక భారీ లక్ష్య ఛేదనలో  కేకేఆర్ పోరాడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (85), ఆరోన్ ఫించ్ (58) లు పోరాడారు. రెండో వికెట్ కు భారీ భాగస్వామ్యం నెలకొల్పినా తర్వాత  వరుసగా వికెట్లు కోల్పోవడంతో కేకేఆర్ కు ఓటమి తప్పలేదు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ ప్రయత్నించినా అది సఫలం కాలేదు.

77

రాజస్తాన్ బౌలర్లలో  స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. 17వ ఓవర్లో తన హ్యాట్రిక్ మాయజాలంతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. ఆ ఓవర్లో హ్యాట్రిక్ తో పాటు నాలుగు వికెట్లు తీసిన చాహల్.. మొత్తంగా ఈ మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. 

click me!

Recommended Stories