సచిన్ టెండూల్కర్‌తో ఆడాల్సిన ప్లేయర్ వేరు! ఆడిన ప్లేయర్ వేరు... సెలక్టర్లు చేసిన ఘోరమైన తప్పిదానికి...

Published : Aug 07, 2023, 03:51 PM IST

ఒకే రకమైన పేర్లు ఉన్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఆర్‌పీ సింగ్ పేరుతో ఇద్దరు క్రికెటర్లు ఉన్నారు. దినేశ్ కార్తీక్, మురళీ కార్తీక్ మధ్య తేడా తెలియక చాలామంది తికమక పడేవాళ్లు. సాధారణ ప్రజానీకం ఇలా పేర్లు తెలియక ఇబ్బంది పడితే పర్లేదు కానీ టీమ్‌ని సెలక్ట్ చేసే సెలక్టర్లే కంఫ్యూజ్ అయితే..  

PREV
15
సచిన్ టెండూల్కర్‌తో ఆడాల్సిన ప్లేయర్ వేరు! ఆడిన ప్లేయర్ వేరు... సెలక్టర్లు చేసిన ఘోరమైన తప్పిదానికి...

వినడానికి కాస్త వింతగా అనిపిస్తున్నా, సెలక్టర్లు చేసిన ఘోర తప్పిదం కారణంగా ఓ అనామక క్రికెటర్, భారత జట్టుకి ఎంపికై ఏకంగా కెనడాలో పర్యటించి వచ్చాడు. అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన జరిగింది 1998లో...

25
Mohammad Kaif, Jai Prakash Yadav, Sourav Ganguly, Virender Sehwag and Yuvraj Sing

టొరంటోలో జరిగిన 1998 సహారా కప్‌ టోర్నీ కోసం మధ్యప్రదేశ్‌ ఆల్‌రౌండర్ జై ప్రకాశ్ యాదవ్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే అతని ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్‌కి చెందిన జ్యోతి ప్రసాద్ యాదవ్... టీమ్‌తో కలిసి కెనడాకి వెళ్లాడు. దీనికి కారణం ఇద్దరి పేర్లలో షార్ట్ కంట్ JPY ఉండడమే...

35

జై ప్రకాశ్ యాదవ్ స్థానంలో జ్యోతి ప్రసాద్ యాదవ్, టీమ్‌తో కలిసి కెనడా టూర్‌కి వెళ్లడమే విషయం, సెలక్టర్లు గ్రహించడానికి చాలా కాలమే పట్టింది. ఈలోపు జ్యోతి ప్రసాద్ యాదవ్, ఫ్రీగా కెనడా అంతా చుట్టి వచ్చాడు... సచిన్ టెండూల్కర్ వంటి ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకున్నాడు.

45
Sachin Tendulkar

ఇలా అనుకోకుండా టీమ్‌లోకి వచ్చిన జ్యోతి ప్రకాశ్ యాదవ్, సహారా కప్‌ టోర్నీలో ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కించుకోలేకపోయాడు. అయితే సెలక్టర్లు చేసిన తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడానికి అతనికి ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి. మొత్తంగా 6 టెస్టు మ్యాచులు ఆడిన జ్యోతి ప్రకాశ్, 374 పరుగులు చేశాడు..

55

సెలక్టర్ల కమ్యూనికేషన్ తప్పిదం వల్ల సహారా కప్ 1998 ఆడే అవకాశం కోల్పోయిన జై ప్రకాశ్ యాదవ్, ఆ తర్వాత నాలుగేళ్లకు టీమ్‌లోకి వచ్చాడు, టీమిండియా తరుపున 12 వన్డేలు ఆడి 6 వికెట్లు తీశాడు. 2002లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన జై ప్రకాశ్, 2005లో శ్రీలంకపై చివరి వన్డే ఆడాడు. ఓ రకంగా సెలక్టర్లు చేసిన తప్పిదం, అతని కెరీర్‌నే నాశనం చేసేసింది.. 

click me!

Recommended Stories