ఇంకా డౌట్ ఎందుకు? టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతనే! హార్ధిక్ పాండ్యాపై కపిల్ దేవ్ కామెంట్...

Published : Jan 22, 2023, 01:01 PM IST

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో తెగ బిజీగా ఉంది భారత జట్టు. గత ఏడాదిలో కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా... ఇలా నలుగురు యువ కెప్టెన్లను పరీక్షించింది టీమిండియా...

PREV
16
ఇంకా డౌట్ ఎందుకు? టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతనే! హార్ధిక్ పాండ్యాపై కపిల్ దేవ్ కామెంట్...
Image credit: PTI

కెఎల్ రాహుల్ ఆరంభంలో కెప్టెన్‌గా వరుస పరాజయాలు అందుకున్నా, ఆ తర్వాత మంచి విజయాలు నమోదు చేశాడు. అయితే టీమిండియా విజయాలు అందుకున్నా, రాహుల్ కెప్టెన్సీకి మాత్రం మంచి మార్కులు పడలేదు...

26
Image credit: PTI

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి జట్టుకి సుదీర్ఘ కాలం దూరమయ్యాడు. రిషబ్ పంత్ ఎప్పుడు జట్టులోకి తిరిగి వస్తాడనే విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. జస్ప్రిత్ బుమ్రా కూడా గాయాలతో బాధపడుతున్నాడు...

36
Image credit: PTI

‘ఇప్పుడు టీమిండియాకి మరో ఆప్షన్ లేదు. టీమ్‌కి ఏం కావాలో హార్ధిక్ పాండ్యాకి బాగా తెలుసు. కెప్టెన్‌గా విజయాలు అందుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా ఓటమి ఎదురైన తర్వాత కమ్‌బ్యాక్ ఎలా ఇవ్వాలో కూడా తెలుసుకున్నాడు...
 

46
Image credit: PTI

హార్ధిక్ పాండ్యా ప్లేయర్లలో నమ్మకం నింపుతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, రెండో టీ20లో అట్టర్ ఫ్లాప్ అయ్యాక కూడా మళ్లీ తర్వాతి మ్యాచ్‌లో ఆడగలిగాడు. ఓ కెప్టెన్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో నాకు లోపాలేమీ కనిపించడం లేదు...

56
Image credit: PTI

హార్ధిక్ పాండ్యా టీమ్‌కి సుదీర్ఘ కాలం సేవలు అందించగలడు. కాబట్టి అతనికి కెప్టెన్సీ అప్పగించడమే సబబుగా ఉంటుంది...  

66
Image credit: PTI

పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి హార్ధిక్ పాండ్యా సిద్ధంగా ఉంటే మరో ఆలోచన లేకుండా అతనికి ఆ బాధ్యతలు అప్పగించండి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. 

click me!

Recommended Stories