గత ఏడాది టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ కెప్టెన్‌గా వ్యవహరించిన బాబర్ ఆజమ్, గ్రూప్ టాపర్‌గా టీమ్‌ని సెమీ ఫైనల్ చేర్చగలిగాడు. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో టీమిండయాపై విజయం అందుకున్న మొట్టమొదటి కెప్టెన్‌గానూ బాబర్ ఆజమ్ చరిత్ర లిఖించాడు...
అయితే ఏడాది గడిచేసరికి సీన్ రివర్స్ అయ్యింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ పోరాడిన పాక్ జట్టు, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. గత టోర్నీలో పాక్ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన షాహీన్ ఆఫ్రిదీ, ఆసిఫ్ ఆలీ, మహ్మద్ రిజ్వాన్.. ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు...
Babar Azam
గత టీ20 వరల్డ్ కప్‌లో బ్యాటుతో అద్భుతంగా రాణించాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి తొలి వికెట్‌కి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే ఈసారి బాబర్ బ్యాటు నుంచి కూడా పరుగులు రావడం లేదు..
టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన బాబర్ ఆజమ్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 9 బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జింబాబ్వేపై అదిరిపోయే రికార్డున్న బాబర్ ఆజమ్ ఫ్యాన్స్‌కి ఇది మింగుడు పడడం లేదు...
BABAR
‘అతను నన్ను ఓ అన్నలా అనుకుంటే, వరల్డ్ కప్ తర్వాత బాబర్ ఆజమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే బెటర్. ఎందుకంటే బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో ఎలాంటి స్పార్క్ కనిపించడం లేదు. అతను 22000-25000 పరుగులు చేయాలని కోరుకుంటున్నా...
కెప్టెన్సీ భారం మోస్తూ అన్ని పరుగులు చేయడం అందరి వల్ల వీలయ్యే పని కాదు. ఈ వరల్డ్ కప్‌లో అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాం. అంతకుముందు ఆసియా కప్‌లోనూ బాబర్ ఆజమ్ పరుగులు చేయలేకపోయాడు...
Babar Azam
బాబర్ దీన్ని అర్థం చేసుకుంటే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడు. విరాట్ కోహ్లీ కూడా అదే చేశాడు. కెప్టెన్సీ ప్రెషర్‌తో పరుగులు చేయలేనప్పుడు దాన్నుంచి తప్పుకున్నాడు. బాబర్‌కి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అతను చాలా కాలం ఆడాలి. బ్యాట్స్‌మెన్‌గా ఎంతో సాధించాలి...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్...
‘అతను కెప్టెన్‌గా కొనసాగాలనుకుంటే అది బాబర్ ఆజమ్‌కి మాత్రమే కాదు, పాక్ టీమ్‌కి కూడా చాలా పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. బాబర్ ఆజమ్ కెప్టెన్సీ నుంచి చర్చ ఇప్పుడు మొదలైంది కాదు. అతనికి కెప్టెన్సీ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినవారిలో నేనూ ఒకడిని...
Babar Azam
కెప్టెన్సీలో తప్పులు చేస్తున్నంతకాలం బ్యాటింగ్‌పై ఫోకస్ చేయలేం. బాబర్ ఆజమ్ టాప్ బ్యాట్స్‌మెన్. అతను పాక్ టీమ్‌కి కెప్టెన్‌గా కంటే బ్యాటర్‌గా చాలా అవసరం. అతనిలో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఏ మాత్రం లేవు. అది అతనికి తెలుసు, అందరికీ తెలుసు...
Image credit: PTI
బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా ఫెయిల్ అవుతున్నాడు, బ్యాటర్‌గానూ ఫెయిల్ అవుతున్నాడు. ఇలాంటి సమయంలో ఏదో ఒకదానిపైన పూర్తి ఫోకస్ పెడితే బెటర్. రాని కెప్టెన్సీ కంటే వచ్చిన బ్యాటింగ్‌పైన పూర్తి ఫోకస్ పెడితే బెటర్ కదా... ’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్...