టాస్‌కి 10 నిమిషాల ముందు అజారుద్దీన్ వచ్చి అలా చెప్పేసరికి... రాహుల్ ద్రావిడ్ కామెంట్...

Published : Jul 30, 2022, 11:54 AM IST

టీమిండియాకి బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా సేవలు అందించిన రాహుల్ ద్రావిడ్, ప్రస్తుతం హెడ్ కోచ్‌గానూ సేవలు అందిస్తున్నాడు.  టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్‌తో కలిసి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రాహుల్ ద్రావిడ్, తన మొదటి మ్యాచ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు...

PREV
110
టాస్‌కి 10 నిమిషాల ముందు అజారుద్దీన్ వచ్చి అలా చెప్పేసరికి... రాహుల్ ద్రావిడ్ కామెంట్...

164 టెస్టుల్లో 13288 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్, వన్డేలు, టెస్టుల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అతికొద్ది మందిలో ఒకడిగా ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు రాహుల్ ద్రావిడ్...

210
Image credit: Getty

1996లో ఇంగ్లాండ్ పర్యటనలో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో సౌరవ్ గంగూలీతో కలిసి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు రాహుల్ ద్రావిడ్... తొలి మ్యాచ్‌లో గంగూలీ సెంచరీ సాధించగా ద్రావిడ్ 95 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు...

310

‘నా క్రికెట్ కెరీర్ చాలా సుదీర్ఘమైనది. అయితే ఇప్పటికే నా తొలి టెస్టు మ్యాచ్, నిన్నే జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. భారత జట్టు తరుపున టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రావడమే చాలా గొప్ప విషయం....

410

అయితే నిజానికి నేను లార్డ్స్ టెస్టు ఆడే జట్టులో లేడు. టాస్‌కి 10 నిమిషాల ముందు కెప్టెన్ నా దగ్గరికి వచ్చి ‘నువ్వు ఈ మ్యాచ్‌లో ఆడుతున్నావ్’ అని చెప్పాడు. సంజయ్ మంజ్రేకర్ ఫిటినెస్ టెస్టులో ఫెయిల్ కావడంతో నాకు తుదిజట్టులో చోటు దక్కింది...

510

ముందే నాకు తెలిసి ఉంటే ఎలా ఉండేదో కానీ మ్యాచ్‌ ప్రారంభమయ్యే చివరి క్షణాల్లో ఆరంగ్రేటం చేయబోతున్నానని తెలియడంతో ఆనందం, భయం రెండూ ఒకేసారి వచ్చాయి.. నా కల నిజమైన రోజు అది...

610

అదృష్టవశాత్తు మేం టాస్ ఓడిపోయి ఫీల్డింగ్ చేశాం. దాంతో నా బ్యాటింగ్ రావడానికి దాదాపు రోజున్నర సమయం పట్టింది. దాంతో నా మనసు కాస్త తేలిక పడి, నన్ను నేను సిద్ధం చేసుకున్నా...

710

ఆ ఐదు రోజులు గడిపిన ప్రతీ క్షణం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ రోజును తలుచుకుంటే నా క్రికెట్ కెరీర్ మొత్తం గుర్తుకు వస్తుంది. కేవలం ఆ రోజు నాకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తే చాలని అనుకున్నా...

810

హాఫ్ సెంచరీ చేసిన షాట్‌ని పాయింట్‌లో నాజర్ హుస్సేన్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. 95 పరుగుల వద్ద అవుట్ అయ్యాక చాలా ఫీల్ అయ్యా.. అయితే చాలా మంది సెంచరీ మిస్ అయినందుకు బాధపడుతున్నారా? అని అడిగారు...

910

అయితే నేను చేసిన 95 పరుగులు నాకు ఎంతో విలువైనవి. వాటిని నా రెండు చేతులతో కళ్లకు అద్దుకుంటానని చెప్పా... ఆ సమాధానం కూడా ఇంకా గుర్తుంది...’ అంటూ 26 ఏళ్ల నాటి విషయాలను చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్...

1010
Rahul Dravid, Daryl Harper

తన కెరీర్‌లో 210 టెస్టు క్యాచులను అందుకున్న రాహుల్ ద్రావిడ్, టెస్టుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న ఫీల్డర్‌గా నిలిచారు. అలాగే టెస్టుల్లో అత్యధిక బంతులను ఎదుర్కొన్న బ్యాటర్ కూడా ద్రావిడే...

click me!

Recommended Stories