కెప్టెన్లు మాత్రమే కాదు, ఓపెనర్ల పరిస్థితి కూడా అంతే... రోహిత్ కెప్టెన్సీలో ఆఖరికి సూర్యకుమార్ యాదవ్‌తో కూడా..

Published : Jul 30, 2022, 11:08 AM IST

రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఓ ప్రయోగాల శాలగా మారిపోయింది. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కారణంగా గత ఏడు నెలల్లో ఏడుగురు కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది. టీమిండియా చరిత్రలోనే ఇదే రికార్డు. ఇప్పుడు ఓపెనర్ల విషయంలోనూ ప్రయోగాలు చేస్తోంది భారత జట్టు...

PREV
110
కెప్టెన్లు మాత్రమే కాదు, ఓపెనర్ల పరిస్థితి కూడా అంతే... రోహిత్ కెప్టెన్సీలో ఆఖరికి సూర్యకుమార్ యాదవ్‌తో కూడా..
Image credit: Getty

టెస్టుల్లో పరిస్థితి ఎలా ఉన్నా వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కొన్నాళ్ల నుంచి స్థిరమైన ఓపెనింగ్ జోడితోనే బరిలో దిగింది టీమిండియా. వన్డేల్లో శిఖర్ ధావన్‌తో ఓపెనింగ్ చేసే రోహిత్ శర్మ, టీ20ల్లో కెఎల్ రాహుల్‌తో ఓపెనింగ్ చేసేవాడు...

210

టెస్టుల్లో మాత్రం నిలకడైన ప్రదర్శన లేని కారణంగా గత రెండేళ్లలో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లతో ఓపెనింగ్ చేయించింది టీమిండియా. గత ఇంగ్లాండ్ టూర్ నుంచి రోహిత్ శర్మతో కలిసి కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తూ వస్తున్నాడు...

310

అయితే రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓపెనింగ్ పొజిషన్ విషయంలో ప్రయోగాలు చేస్తోంది టీమిండియా. రోహిత్ రెస్ట్ తీసుకోవడం, కెఎల్ రాహుల్ గాయపడడంతో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ కలిసి ఓపెనింగ్ చేశారు.

410
Image credit: PTI

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి ఓ మ్యాచ్‌లో దీపక్ హుడా, మరో మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు రోహిత్ శర్మ...

510

రెండో టీ20లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు రోహిత్ శర్మ. అయితే మూడో టీ20లో రిషబ్ పంత్ 5 బంతులాడి 1 పరుగుకే అవుట్ కావడంతో ఈ ప్రయోగాన్ని కూడా విరమించుకుంది టీమిండియా...

610

తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ వచ్చి అందర్నీ షాక్‌కి గురి చేశాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, దీపక్ హుడా రూపంలో ఇప్పటికే వాడిన ముగ్గురు ఓపెనర్లు ఉన్నా... వారిని తుదిజట్టులోకి తీసుకోలేదు టీమిండియా...

710
Image credit: PTI

ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచిన ఇషాన్ కిషన్‌ని వరుసగా మూడు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌లోనే కూర్చోబెట్టేసింది. పరిస్థితుల ప్రభావం వల్ల ఇంతమంది కెప్టెన్లను మార్చాల్సి వచ్చిందని చెప్పిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ఈ ఓపెనర్ల మార్పు గురించి ఏమంటారో చూడాలి..

810

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లేస్‌కి చెక్ పెడతాడని చెప్పుకుంటున్న ఆల్‌రౌండర్ దీపక్ హుడాకి కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు... 

910
pujara

ఆఖరికి టెస్టుల్లోనూ ఓపెనర్ల విషయంలో ప్రయోగాలు చేస్తోంది రోహిత్ సేన. కెఎల్ రాహుల్ గాయం కారణంగా ఇంగ్లాండ్ ఐదో టెస్టుకి అందుబాటులో లేకపోవడంతో ఛతేశ్వర్ పూజారాని శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ పంపించింది.

1010

మయాంక్ అగర్వాల్ రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నా పూజారాని ఓపెనర్‌గా పంపుతూ తీసుకున్న నిర్ణయం పెద్దగా వర్కవుట్ కాలేదు.. ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను మాత్రమే ఆడించాలనే ఆలోచన మంచిదే కానీ టీమ్ కాంబినేషన్ గురించి కూడా కాస్త పట్టించుకోవాలని రోహిత్ అండ్ టీమ్‌కి సూచిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

Read more Photos on
click me!

Recommended Stories