భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్(ఎన్‌సీఏ) పదవికి తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. జూలై 8, 2019న తొలిసారిగా ఎన్‌సీఏ డైరెక్టర్‌గా తొలిసారి బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గత నెల ముగిసింది... తిరిగి ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు ద్రావిడ్...
ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో ముగియనుంది. ఆ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకుంటారని టాక్ వినిపించింది...
29
శ్రీలంక టూర్‌లో భారత జట్టుకి హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్, టీమిండియా తర్వాతి కోచ్‌గా నియమితం కావడం పక్కా అనుకున్నారంతా... అయితే ఎన్‌సీఏ డైరెక్టర్ పొజిషన్‌కి ద్రావిడ్ అప్లై చేయడం, టీమిండియా ఫ్యాన్స్‌లో అయోమయం మొదలైంది...
39
‘అవును, రాహుల్ ద్రావిడ్, ఎన్‌సీఏ హెడ్ పొజిషన్‌కి మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. మేం కాంట్రాక్ట్‌ను పొడగించలేం. అందుకే దరఖాస్తుల ద్వారా ఎంపిక చేయాలని నిర్వహించాం...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి తెలియచేశారు...
49
ఎన్‌సీఏలో 25 నుంచి 30 మందిదాకా సిబ్బంది ఉంటారు. ఇందులో 12 మంది నేరుగా హెడ్‌కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌సీఏ, బీసీసీఐ సెక్రటరీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది...
59
ఎన్‌సీఏలో జరిగే క్రికెట్ కోచింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటికీ హెడ్ రాహుల్ ద్రావిడ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. జాతీయ జట్టుకి ఎంపికైన క్రికెటర్లతో పాటు ఇండియా ఏ, అండర్ 23, అండర్19 జట్లకి ఎంపికయ్యే క్రికెటర్లు... ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటారు.
69
అలాగే గాయంతో జట్టుకి దూరమైన ప్లేయర్లు కూడా తిరిగి టీమ్‌లో చేరడానికి ఎన్‌సీఏలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2020లో గాయపడిన రోహిత్ శర్మ... ఎన్‌సీఏలో రాహుల్ ద్రావిడ్ సమక్షంలో శిక్షణ తీసుకుని, తిరిగి ఆసీస్ టూర్‌లో ఉన్న టీమిండియాతో కలిశాడు...
79
ఇలా రాహుల్ ద్రావిడ్ సమక్షంలో శిక్షణ తీసుకున్న శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, నవ్‌దీప్ సైనీ వంటి క్రికెటర్లు టీమిండియాలోకి ఆరంగ్రేటం చేసి అదరగొట్టారు...
89
ఎన్‌సీఏ డైరెక్టర్‌గా తిరిగి అప్లై చేయడంతో రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు సుముఖంగా లేడని టాక్ వినబడుతోంది. అయితే ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ, హెడ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు...
99
హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకునేటప్పుడు, ఎన్‌సీఏ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు బీసీసీఐ మరోసారి ఈ పోస్టు కోసం దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది...