ఫినిషర్‌గా కాదు, అతన్ని ఓపెనర్‌గా పంపండి... వీరేంద్ర సెహ్వాగ్‌లా సూపర్ సక్సెస్ అవుతాడు...

Published : Jun 28, 2022, 10:43 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో 863 పరుగులు చేసి రికార్డుల మోత మోగించాడు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్. ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వస్తుండడంతో 32 ఏళ్ల జోస్ బట్లర్‌కే ఆ బాధత్యలు దక్కవచ్చని టాక్ వినబడుతోంది...

PREV
18
ఫినిషర్‌గా కాదు, అతన్ని ఓపెనర్‌గా పంపండి... వీరేంద్ర సెహ్వాగ్‌లా సూపర్ సక్సెస్ అవుతాడు...
Jos Buttler

ఐపీఎల్ 2022 తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా అదరగొట్టిన జోస్ బట్లర్, ఓ మ్యాచ్‌లో 162, మరో మ్యాచ్‌లో 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.. వైట్ బాల్ క్రికెట్‌లో ఫామ్ కారణంగా రెడ్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు బట్లర్...

28
Image credit: PTI

యాషెస్ సిరీస్ పరాజయం తర్వాత టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయిన జోస్ బట్లర్, టీమిండియాతో జరిగే ఐదో టెస్టుకి వికెట్ కీపర్‌గా వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కరోనా బారిన పడడంతో బట్లర్‌కి తుదిజట్టులో అవకాశం దక్కొచ్చని అంచనా...

38
Jos Buttler

‘జోస్ బట్లర్‌ని టెస్టుల్లో ఆరు లేదా ఏడో స్థానాల్లో పంపుతున్నారు. వన్డేల్లో, టీ20ల్లో జోస్ బట్లర్ ఓపెనర్‌గా వచ్చి సూపర్ సక్సెస్ అయ్యాడు. అలాంటి టెస్టుల్లో కాలేడా?.

48

వీరేంద్ర సెహ్వాగ్, మాథ్యూ హేడెన్ వంటి ప్లేయర్లు టెస్టుల్లో ఓపెనర్లుగా సూపర్ సక్సెస్ అయ్యారు. జోస్ బట్లర్‌ని ఓపెనర్‌గా పంపితే వారిలా వేగంగా పరుగులు చేస్తూ, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు నిర్మించగలడు.. 

58

ఐపీఎల్‌లో బట్లర్ ఎలా ఆడాడో చూశారుగా... నేనైతే బట్లర్ లాంటి విధ్వంసక బ్యాటర్‌ని ఈ తరంలో చూడలేదు...’ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగర్కర...

68
Kumar Sangakkara

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు కుమార సంగర్కర. సంగర్కర కోచింగ్‌లో జోస్ బట్లర్, 2016లో విరాట్ కోహ్లీ తర్వాత ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

78

jos buttler

57 టెస్టులు ఆడిన జోస్ బట్లర్ 31.94 సగటుతో 2907 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

88

బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా, బ్రెండన్ మెక్‌కల్లమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత న్యూజిలాండ్‌ని మూడు మ్యాచుల్లో చిత్తు చేసి, హ్యాట్రిక్ విజయాలు అందుకుంది ఇంగ్లాండ్...

click me!

Recommended Stories