ముంబై ఇండియన్స్‌కి గుడ్‌న్యూస్... రీఎంట్రీ ఇస్తున్న జోఫ్రా ఆర్చర్! ఐపీఎల్ 2023 నాటికి...

First Published Dec 22, 2022, 3:59 PM IST

ముంబై ఇండియన్స్ జట్టుకి శుభవార్త. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్... రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాదాపు రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతూ జట్టులోకి వచ్చి పోతూ ఉన్న జోఫ్రా ఆర్చర్.. మార్చి 2021 నుంచి క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు..

Image credit: Getty

మోచేతితో గాయంతో బాధపడుతూ శస్త్ర చికిత్స కూడా చేయించుకున్న జోఫ్రా ఆర్చర్, 9 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి ఆరంగ్రేటం చేస్తున్నాడు. వచ్చే నెలలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కి ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టులో జోఫ్రా ఆర్చర్‌కి చోటు దక్కింది...

ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు ఇంట్లో ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తూ గాయపడ్డాడు జోఫ్రా ఆర్చర్. ఆర్చర్ చేతిలో గాజు పెంకులు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు, శస్త్ర చికిత్స ద్వారా వాటిని తొలగించారు. ఈ గాయం కారణంగా 2021 సీజన్‌కి దూరంగా ఉన్నాడు ఆర్చర్.. 

ఐపీఎల్ 2022 మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్‌ని రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. గాయం కారణంగా 2022 సీజన్‌ని ఆర్చర్ అందుబాటులో ఉండడని తెలిసినా, అతని కోసం భారీగా ఖర్చు చేసింది ముంబై...

జోఫ్రా ఆర్చర్ మీద మోజుతో మిగిలిన ప్లేయర్లపై ఆసక్తి చూపించకపోవడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది ముంబై ఇండియన్స్. 2022లో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకున్న రోహిత్ సేన, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి చెత్త రికార్డు మూటకట్టుకుంది...

Jofra Archer

పాకిస్తాన్ టూర్‌‌లో టెస్టు సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, జనవరి 27 నుంచి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో జోఫ్రా ఆర్చర్‌కి చోటు దక్కింది...

జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌తో పాటు మొయిన్ ఆలీ, హారీ బ్రూక్, సామ్ కుర్రాన్, బెన్ డక్లెట్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, ఫిలిప్ సాల్ట్, ఓల్లీ స్టోన్, రీస్ తోప్లే, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్‌లకు చోటు దక్కింది..

ట్రెంట్ బౌల్ట్ దూరం కావడం, జస్ప్రిత్ బుమ్రా స్థాయికి దగ్గ పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో వరుస పరాజయాలు చవిచూసిన ముంబై ఇండియన్స్... జోఫ్రా ఆర్చర్ తమ కష్టాలను తీరుస్తాడని భారీ ఆశలే పెట్టుకుంది.. 

click me!