టాప్ లేపిన జో రూట్! డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడకపోయినా టాప్‌లోనే అశ్విన్... యాషెస్ ముగిసేలోపు...

Published : Jun 22, 2023, 12:43 PM IST

ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్, మూడేళ్లుగా కెరీర్ పీక్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 2019 ఏడాది ముగిసే వరకూ కేవలం 17 టెస్టు సెంచరీలతో మాత్రమే ఉన్న జో రూట్, గత మూడేళ్లలో 13 సెంచరీలు సాధించి... 30 టెస్టు సెంచరీలతో స్టీవ్ స్మిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు...

PREV
19
టాప్ లేపిన జో రూట్! డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడకపోయినా టాప్‌లోనే అశ్విన్... యాషెస్ ముగిసేలోపు...

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు జో రూట్. బెన్ స్టోక్స్ తొందరపడి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు కానీ లేదంటే కనీసం 150+, వీలైతే 200 కొట్టేసేవాడే...
 

29

రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసిన జో రూట్, హారీ బ్రూక్‌తో కలిసి రెండో ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 స్థానాలు ఎగబాకిన జో రూట్, ఐసీసీ నెం.1 టెస్టు బ్యాటర్‌గా అవతరించాడు...
 

39
Marnus Labuschagne

ఇదే సమయంలో గత కొన్ని నెలలుగా ఐసీసీ నెం.1 టెస్టు బ్యాటర్‌గా ఉంటూ వస్తున్న మార్నస్ లబుషేన్, తొలి టెస్టులో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్ అయిన లబుషేన్, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో లబుషేన్ రెండు స్థానాలు దిగజారి, మూడో స్థానానికి పడిపోయాడు..

49
Steve Smith

గత వారం టాప్ 2లో ఉన్న స్టీవ్ స్మిత్ కూడా తొలి టెస్టులో ఫెయిల్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులే చేశాడు. దీంతో స్టీవ్ స్మిత్ కూడా నాలుగు స్థానాలు దిగజారి టాప్ 6లోకి పడిపోయాడు..

59
Kane Williamson

లబుషేన్, స్టీవ్ స్మిత్ ఫెయిల్యూర్‌తో నాలుగో స్థానంలో ఉన్న కేన్ విలియంసన్, రెండో స్థానానికి ఎగబాకాడు. గాయం కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న కేన్ విలియంసన్‌కి ఇది ఊహించని ప్రమోషన్..

69

టీమిండియాపై డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సెంచరీ చేసి టాప్ 3లోకి వచ్చిన ట్రావిస్ హెడ్, టాప్ 4కి దిగజారగా బాబర్ ఆజమ్ టాప్ 5 స్థానాన్ని కాపాడుకున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, రెండు స్థానాలు ఎగబాకి టాప్ 7కి వచ్చాడు..

79

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టాప్ 10లో ఉన్న ఏకైక భారత టెస్టు బ్యాటర్. రోహిత్ శర్మ టాప్ 12వ ర్యాంకులో, విరాట్ కోహ్లీ టాప్ 14వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా 25వ ర్యాంకులో ఉన్నాడు..
 

89
Image credit: Getty

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు దక్కించుకోలేకపోయినా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్ ర్యాంకుని కాపాడుకోగలిగాడు. తొలి టెస్టులో జేమ్స్ అండర్సన్ ఫెయిల్యూర్, అశ్విన్‌కి కలిసి వచ్చింది..

99
England vs Australia

యాషెస్ సిరీస్ ముగిసే సమయానికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంచలన మార్పులు రావచ్చు. ఆరో స్థానానికి పడిపోయిన స్టీవ్ స్మిత్, రెండో టెస్టులో సెంచరీ చేస్తే, టాప్‌లోకి దూసుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే టాప్‌లో ఉన్న జో రూట్, రెండో టెస్టులో ఫెయిల్ అయితే మళ్లీ కిందకి దిగజారుతాడు.. 

click me!

Recommended Stories