కేవలం బ్యాటింగ్ కోసమే రవీంద్ర జడేజాని ఆడిస్తున్నారా... టీమిండియా డిఫెన్సిన్ ఆటతీరుపై...

Published : Jul 05, 2022, 04:00 PM IST

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మొదటి మూడున్నర రోజులు పూర్తి డామినేషన్ చూపించిన భారత జట్టు, నాలుగో ఇన్నింగ్స్‌లో మాత్రం తేలిపోయింది. ఫామ్‌లో లేని ఇంగ్లాండ్ ఓపెనర్లు ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపిస్తుంటే ఏం చేయాలో తెలియక నిమ్మకుండిపోయారు భారత బౌలర్లు. ఫలితం అస్సలు ఛాన్సే లేదనుకున్న ఇంగ్లాండ్, విజయానికి చేరువైంది...

PREV
18
కేవలం బ్యాటింగ్ కోసమే రవీంద్ర జడేజాని ఆడిస్తున్నారా... టీమిండియా డిఫెన్సిన్ ఆటతీరుపై...
Image credit: Getty

నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్ స్ట్రాటెజీతో ఐదో టెస్టులో బరిలో దిగిన భారత జట్టు, తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజాతో వేయించింది 2 ఓవర్లు మాత్రమే. జానీ బెయిర్‌స్టో స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతాడు... 

28
Image credit: Getty

అయితే బెయిర్‌స్టో, ఫాస్ట్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతున్నా రవీంద్ర జడేజాని బౌలింగ్‌కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు భారత జట్టు... బాల్ ఎక్కడో తగిలిన తర్వాత గార్డు పెట్టుకున్నట్టు... రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజాతో 15 ఓవర్లు వేయించినా పెద్దగా ఫలితం దక్కలేదు...

38
Image credit: Getty

‘రవీంద్ర జడేజా చాలా మంచి బౌలర్. అయితే అతన్ని పరుగులు నియంత్రించడానికి మాత్రమే వాడుకోవాలని ప్రయత్నించింది టీమిండియా. ఇదే టీమిండియా చేసిన అతిపెద్ద తప్పిదం...

48

370 పరుగుల లక్ష్యఛేదనలో 100 పరుగుల వద్ద 3 వికెట్లు పడిన తర్వాతైనా అటాకింగ్ మోడ్‌లో బౌలింగ్ చేయాల్సింది. అలాంటి సమయంలో నిర్ధయగా అటాక్ చేసి, వికెట్లు తీస్తేనే మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకానీ బ్యాటర్లు తప్పు చేసే దాకా ఓపిగ్గా ఎదురుచూడకూడదు...

58

రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లు చాలా పరుగులు రాబట్టారు. జడ్డూలాంటి బౌలర్‌, వికెట్లు తీయడంలో ఫెయిల్ అవ్వడమే కాకుండా భారీగా పరుగులు ఇచ్చినప్పుడే భారత జట్టు వెనకబడింది..  జానీ బెయిర్‌స్టో, జడేజా బౌలింగ్‌లో చాలా ఈజీగా బౌండరీలు బాదాడు...
 

68

ఓ స్పిన్నర్‌గా వికెట్ తీయాలనే మైండ్‌సెట్‌తో బౌలింగ్ చేస్తే వికెట్లకు గురి పెడుతూ బౌలింగ్ చేయాలి. అంతేకానీ ఆఫ్ స్టంప్ అవతల బౌలింగ్ వేయకూడదు. అలా వేయమని చెబితే నాకు నచ్చదు కూడా. నేను చాలా సార్లు అలాంటి సందర్భాల్లో కెప్టెన్ల మాట కూడా వినలేదు...

78

నాలుగో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లే మ్యాచ్‌లను గెలిపించడానికి కీలకం అవుతారు. కనీసం జడేజా నుంచి 2 లేదా 3 వికెట్లు వచ్చి ఉండాల్సింది. పిచ్ కూడా స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తోంది. 

88

అయితే జడ్డూ మ్యాజిక్ చేయలేకపోవడమే టీమిండియా వెనకబడడానికి ప్రధాన కారణం... చూస్తుంటే బ్యాటింగ్‌లో పరుగులు చేయడానికి మాత్రమే అతన్ని ఆడిస్తున్నట్టు ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్..

click me!

Recommended Stories