జియో సిమ్ వాడుతున్నారా.. అయితే ఇలా ఫ్రీగా ఐపీఎల్ 2023 మినీ వేలం లైవ్ చూసేయండి! ఎలాగంటే...

Published : Dec 22, 2022, 11:56 AM IST

ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో 405 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు...

PREV
18
జియో సిమ్ వాడుతున్నారా.. అయితే ఇలా ఫ్రీగా ఐపీఎల్ 2023 మినీ వేలం లైవ్ చూసేయండి! ఎలాగంటే...

10 ఫ్రాంఛైజీల్లో ఉన్న 87 ఖాళీల భర్తీ కోసం 2023 మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో కామెరూన్ గ్రీన్, బెన్ స్టోక్స్, మయాంక్ అగర్వాల్, సామ్ కుర్రాన్, అజింకా రహానే వంటి స్టార్ ప్లేయర్లు కూడా పాల్గొనబోతున్నారు. ఈసారి ఆక్షన్ టేబుల్ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్‌తో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడేందుకు బీసీసీఐ అనుమతించింది...

28

ఇంతకుముందు వేలం జరుగుతున్న సమయంలో వేలానికి వచ్చిన సభ్యులు, హెడ్ ఫోన్స్ ద్వారా మేనేజ్‌మెంట్‌తో చర్చలు జరిపేవాళ్లు. ఇప్పుడు నేరుగా వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఏం జరుగుతున్నది చూస్తూ... వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది బీసీసీఐ...

38

10 ఫ్రాంఛైజీల రాకతో టీమ్ పర్సుని రూ.95 కోట్లకు పెంచారు. ఐపీఎల్ 2023-27 సీజన్‌ల టెలికాస్ట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. కాబట్టి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్, ఐపీఎల్ 2023 మినీ వేలం ప్రత్యేక్ష ప్రసారం కానుంది...
 

48

డిజిటల్ రైట్స్‌ని వయాకాం18- రిలయెన్స్ సొంతం చేసుకుంది. జియో సిమ్ వాడుతున్నవాళ్లు, జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ 2023 మినీ వేలాన్ని ఉచితంగా ప్రత్యేక్ష ప్రసారం చూడవచ్చు. జియో సినిమా యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత జియో రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే చాలు, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సిన అవసరం లేదు...

58

జియో సిమ్ లేని వాళ్లు మాత్రం ఐపీఎల్ 2023 మినీ వేలం లైవ్ చూడాలంటే వూట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వూట్ యాప్‌ ఏడాదికి రూ.999లను సబ్‌స్కిప్షన్ మొత్తంగా వసూలు చేస్తోంది. రూ.99 చెల్లిస్తే నెల రోజులు వూట్ యాప్‌ని వీక్షించవచ్చు...

68

ఐపీఎల్ 2023 మినీ వేలానికి 991 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా ఇందులో నుంచి 405 మంది మాత్రమే షార్ట్ లిస్టు చేయబడ్డారు. ఇందులో 273 మంది స్వదేశీ ప్లేయర్లు కాగా 132 మంది విదేశీ ప్లేయర్లు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా రూ.42.25 కోట్లతో ఈ వేలంలో పాల్గొంటోంది..

78

పంజాబ్ కింగ్స్ దగ్గర రూ.32.2 కోట్లు ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ రూ.23.35 కోట్లతో వేలంలో పాల్గొంటోంది. ముంబై ఇండియన్స్ రూ.20.55 కోట్లతో బరిలో దిగుతుంటే చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో రూ.20.45 కోట్లు ఉన్నాయి.. 

88

ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర రూ.19.45 కోట్లు ఉండగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ రూ.19.25 కోట్ల పర్సు వాల్యూతో వేలంలో పాల్గొంటోంది.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.8.75 కోట్లు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పర్సులో రూ. 7.05 కోట్లు ఉన్నాయి.. 

click me!

Recommended Stories