రోహిత్, పోలార్డ్, పాండ్యా కాదు! నేను చూసిన బెస్ట్ బ్యాటర్ అతనే... జిమ్మీ నీశమ్‌తో ట్రెంట్ బౌల్ట్...

First Published Jan 29, 2023, 3:03 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. క్రిస్ లీన్, జేమ్స్ నీశమ్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన ట్రెంట్ బౌల్ట్, 2020-21 సీజన్లలో ముంబై ఇండియన్స్‌కి ఆడాడు...

ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 3లో కొనసాగుతున్న ట్రెంట్ బౌల్ట్, 2020లో ముంబై ఇండియన్స్ క్యాంపులోకి వచ్చినప్పుడే సూర్యకుమార్ యాదవ్, స్టార్ బ్యాటర్ అవుతాడని అంచనా వేశాడట. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు ముంబై ఇండియన్స్ తరపున ఆడిన జేమ్స్ నీశమ్...

‘‘రెండేళ్ల క్రితం నేను ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాను. మా మొదటి ట్రైయినింగ్ సెషన్స్ తర్వాత ట్రెంట్ బౌల్ట్ నా వైపు తిరిగి... ‘అతన్ని చూడు.. నేను చూసిన బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఇతనే...’ అని సూర్యకుమార్ యాదవ్‌ని చూపించాడు...

ముంబై ఇండియన్స్ అంటే స్టార్ టీమ్. అందులో రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్ వంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే సూర్యకుమార్ గురించి ట్రెంట్ బౌల్ట్ ఇలా చెప్పాడంటే అది చాలా పెద్ద స్టేట్‌మెంట్...

అయితే ట్రెంట్ బౌల్ట్ ఎందుకు అలా చెప్పాడో సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ప్రపంచానికి నిరూపిస్తున్నాడు. సూర్య ఆడిన ఒక్కో ఇన్నింగ్స్ దేనికదే స్పెషల్. మనం ఎలాంటి ప్లాన్‌తో వచ్చినా, దానికి సూర్య దగ్గర సమాధానం ఉంటుంది...
 

Rajkot: Indian player Suryakumar Yadav celebrates his century during the 3rd T20 cricket match between India and Sri Lanka at Saurashtra Cricket Association Stadium, in Rajkot, Saturday, Jan. 7, 2023. (PTI PhotoKunal Patil)(PTI01_07_2023_000242B)

అతను 360 డిగ్రీ ప్లేయర్. ఏబీ డివిల్లియర్స్ పీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఎలా ఆడేవాడో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అలా ఆడుతున్నాడు... సూర్య వరల్డ్ క్లాస్ ప్లేయర్. అందులో ఎలాంటి డౌట్ లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీశమ్..

Image credit: PTI

2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఎదుర్కొన్న మొట్టమొదటి బంతికే సిక్సర్ బాదాడు. ఇప్పటిదాకా 44 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 178.76 సగుతో 1625 పరుగులు చేసి ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా నిలిచాడు సూర్య...

click me!