జెమీమా ఆట క్లాసే.. కానీ జరిగేది మాస్ జాతరే..!

Published : Oct 31, 2025, 12:29 AM IST

Jemimah Rodrigues : ఐసిసి మహిళల వరల్డ్ కప్ 2025 లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నారు టీమిండియా ఆల్ రౌండర్ జెమిమా రోడ్రిగ్స్. ఆమె బ్యాటింగ్ స్టైల్ గురించే ఇప్పుడంతా చర్చ జరుగుతోంది.  

PREV
15
జెమీమా మాయ...

ICC Womens World Cup 2025 : స్వదేశంలో జరుగుతున్న ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 లో టీమిండియా ఫైనల్ కి చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారీ లక్ష్యాన్ని చేధించి ఫైనల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది భారతజట్టు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించి క్రీడా ప్రియుల నుండేకాదు యావత్ దేశప్రజల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు జెమిమా రోడ్రిగ్స్. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి జెమిమా తన కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడారు... సెంచరీ సాధించడమే కాదు చివరివరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.

25
జెమీమా క్లాస్ బ్యాాటింగ్

జెమీమా ఆటను చూసినవారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను గుర్తుచేసిందని అంటున్నారు. ఆయనలాగే జెమీమాది కూడా భారీ పర్సనాలిటీ కాదు... అందుకే హిట్టింగ్ కాకుండా టెక్నికల్ షాట్లను ఎంచుకుంటారు. అందుకే జెమిమా బ్యాటింగ్ సచిన్ ను పోలి ఉండవచ్చు.

35
టెక్నిక్, టైమింగే ఆమె బలం...

జెమిమా రోడ్రిగ్స్ టెక్నిక్ తో పాటు టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆమె బ్యాటింగ్ ఎక్కువగా టైమింగ్, ప్లేస్‌మెంట్ పై ఆధారపడి సాగుతుంది. ఫీల్డర్ల పైనుంచి కాకుండా వారి మధ్యలోంచి షాట్లు ఆడటం ఆమె స్టైల్... అంటే బంతిని రిస్క్ తీసుకుని గాల్లో ఆడటం కంటే రిస్క్ లేకుండా బంతి నేలపై ఉండేలా ఆడటం జెమిమా బ్యాటింగ్ స్టైల్. అందుకే ఆమెనుండి పెద్దపెద్ద షాట్లను ఎక్కువగా చూడలేం... కానీ పరుగులు వరద మాత్రం సాగుతుంది.

45
కవర్ డ్రైవ్ స్పెషలిస్ట్

జెమిమాను టీమిండియా ఫ్యాన్స్ కవర్ డ్రైవ్ స్పెషలిస్ట్ అంటుంటారు. అలాటే ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఆడే ఇన్‌సైడ్-అవుట్ ఆమె సిగ్నీచర్ షాట్స్. ఇలా ఎంతో టెక్నిక్ తో సాగే జెమీమా బ్యాటింగ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. రన్ రేటు ఏమాత్రం తగ్గకుండా సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తుంటుంది. అవసరం అనుకుంటే తాను తగ్గి ఎదుటివారు భారీ ఇన్నింగ్ ఆడేందుకు సహకరిస్తుంది.

55
ఆల్ రౌండ్ షో...

జెమిమా మంచి బ్యాటర్ మాత్రమే కాదు బౌలర్, ఫీల్డర్ కూడా. బంతితో మాయ చేయగలదు... మైదానంలో చిరుతలా కదులుతూ ఫీల్డింగ్ చేయగలదు. కొన్ని మ్యాచుల్లో ఆమె కళ్లుచెదిరే క్యాచ్ లు అందుకుంది. ఈ వరల్డ్ కప్ లో కూడా మంచి ఫీల్డర్ గా జట్టుకు తన సేవలు అందింస్తోంది. ఆమె మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తన పాత్రను మార్చుకోగలదు.

Read more Photos on
click me!

Recommended Stories