జెమీమా రోడ్రిగ్స్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ .. ఆమె మొదటి గురువు ఎవరో తెలుసా?

Published : Oct 30, 2025, 11:36 PM IST

Jemimah Rodrigues :  ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ విజయం తర్వాత జెమిమా రోడ్రిగ్స్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె ఆటతీరుకు ఫిదా అయిన ఫ్యాన్స్ ఈస్థాయికి ఎలా ఎదిగారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

PREV
15
సెంచరీతో అదరగొట్టిన జెమిమా

ICC World Cup 2025 : స్వదేశంలో జరుగుతున్న ఐసిసి ఉమెన్ వరల్డ్ కప్ 2025 మెగా టోర్నీలో టీమిండియా ఫైనల్ కి చేరింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని విసరగా… దాన్ని టీమిండియా చేధించింది. ఇది జెమిమా రోడ్రిగ్స్ సెంచరీ (127 పరుగులు) వల్లే సాధ్యమయ్యింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (89 పరుగులు) తో కలిసి జెమిమా సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దీప్తి శర్మ, రిచా ఘోష్ మెరుపులు కూడా తోడవడంతో టీమిండియా5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సెమీఫైనల్లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న జెమిమా యావత్ దేశప్రజల దృష్టిని ఆకట్టుకున్నారు. దీంతో ఆమె కుటుంబ నేపథ్యం, క్రికెటర్ గా ఎలా ఎదిగారు అనేది తెలుసుకునేందుకు క్రీడా ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి జెమిమా వ్యక్తిగత జీవితం, క్రికెట్ ను కెరీర్ గా ఎలా ఎంచుకున్నారో తెలుసుకుందాం.

25
జెమిమా స్వస్థలం ఏది?

జెమీమా రోడ్రిగ్స్ మంగళూరుకు చెందిన క్రైస్తవ కుటుంబంలో జన్మించారు... ఈమె జన్మించకముందే తల్లిదండ్రులు ముంబైలో స్థిరపడ్డారు. తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్, తల్లి లవితా రోడ్రిగ్స్. ఈమె తల్లిదండ్రులతో చాలా స్నేహంగా ఉంటారు. ఆమె తన విజయానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రుల త్యాగాలు, కృషి అని చెబుతుంటారు. తండ్రి ఇవాన్ ఆమె తొలి గురువు, కోచ్... అతడే కూతురిని క్రీడలవైపు ప్రోత్సహించారు. తల్లి, సోదరులు ఎనోక్, ఏలీ కూడా ఆమెను ప్రోత్సహించారు. ఆమె చిన్నతనంలో అన్నదమ్ములతో కలిసి క్రికెట్ ఆడింది.

35
క్రీడా సౌకర్యాల కోసం కుటుంబం త్యాగం

జెమిమా కుటుంబం మొదట్లో ముంబైలోని భాండుప్‌లో నివసించేది... పిల్లలకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందించడానికి ఇవాన్ కుటుంబాన్ని బాంద్రా వెస్ట్‌కు మార్చారు. ఇవాన్ రోడ్రిగ్స్ ఆమె పాఠశాలలో జూనియర్ కోచ్‌గా పనిచేసేవారు... జెమీమా క్రీడను కొనసాగించడానికి బాలికల క్రికెట్ జట్టును కూడా స్థాపించారు

45
తండ్రే ఆమె కోచ్..

క్రికెట్‌పై జెమీమాకు ఉన్న ఆసక్తిని చూసి కుటుంబం డబ్బు గురించి ఆలోచించకుండా శిక్షణ ఇప్పించింది… ఈ విషయంలో అస్సలు రాజీ పడలేదు. శిక్షణ ఇవ్వడానికి సరైన మైదానాలు, అకాడమీలు అందుబాటులో లేనప్పుడు తండ్రి ఇవాన్ ఫుట్‌పాత్‌పైనే జెమిమాకు శిక్షణ ఇచ్చేవారట. ఇంటి గోడలపై ప్లాస్టిక్ బాల్‌తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవారు.

55
జెమిమా తండ్రి కష్టం..

 జెమిమా బ్యాటింగ్ చేసే సమయంలో ఇవాన్ ప్రతిరోజూ 300 బంతులు విసిరేవారు... దీంతో ఆయన చేయి నొప్పిగా.. ఒక్కోసారి వాపు వచ్చేదని తల్లి లవితా రోడ్రిగ్స్ తెలిపారు. ఈ బాధను ఆయనే దిగమింగుకునేవారని... ఎప్పుడూ కూతురికి చెప్పలేదన్నారు. జెమీమా అంతర్జాతీయంగా ఆడాలనేది ఆయన కల... ఇందుకోసం ఎంతో కష్టపడ్డారని లవితా వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories