ఈ చిన్నారి చిచ్చర పిడుగు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడంతా ఈమె గురించే చర్చ

Published : Oct 31, 2025, 10:19 AM IST

Jemimah: ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు భారత మహిళా క్రికెట్ ప్రపంచంలో చిచ్చర పిడుగుగా మారింది. తాజాగా ఆస్ట్రేలియాపై జరిగిన ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో ఆమె చేసిన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చగా మారింది.  

PREV
15
ముంబై నుంచి వెలుగులోకి వచ్చిన స్టార్‌

ముంబైలో 2000 సెప్టెంబర్ 5న జన్మించిన జెమీమా జెస్సికా రోడ్రిగ్స్‌ చిన్న వయస్సులోనే బ్యాట్ పట్టి క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. బాంద్రా ప్రాంతంలో పెరిగిన ఆమెకు క్రీడలపై సహజమైన ఆసక్తి. మొదట హాకీ ఆడినా, చివరికి క్రికెట్‌నే తన జీవిత లక్ష్యంగా ఎంచుకుంది.

25
హాకీ నుంచి క్రికెట్ దిశగా..

జెమీమా త‌న క్రీడా జీవితాన్ని హాకీ ప్లేయ‌ర్‌గా మొదలు పెట్టింది. మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లలో ఆమె ప్రాతినిధ్యం వహించింది. కానీ క్రికెట్ మీద ఉన్న ఇష్టం ఆమెను మరో దారిలో నడిపించింది. రెండు క్రీడల్లో ఒకటిని ఎంచుకోవాల్సినప్పుడు, క్రికెట్‌నే ఎంచుకుంది. “హాకీ నా హాబీ, కానీ క్రికెట్ నా గుండె చప్పుడు.” అని చెబుతోంది జెమీమా.

35
క్రికెట్ కెరీర్

జెమిమా 2018 ఫిబ్రవరిలో భారత జట్టు తరఫున టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం మార్చిలో వన్డేల్లో కూడా ఆడింది. అంతకు ముందు, 2017లో అండర్-19 వన్డే మ్యాచ్‌లో సౌరాష్ట్రపై 202 పరుగులు (నాటౌట్) చేసి, డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళగా నిలిచింది. ప్రస్తుతం ఆమె వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున, అలాగే ఆస్ట్రేలియా WBBL లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుతో ఆడుతోంది. ఆమె అంతర్జాతీయ రికార్డుల విషయానికొస్తే.. వన్డేల్లో 1,500కు పైగా పరుగులు, టీ20ల్లో 2,300కుపైగా పరుగులు (2025 నాటికి).

45
ప్రత్యేక విజయాలు:

* వన్డే బౌలింగ్‌లో 5 వికెట్లు తీసి, ఉత్తమ ఫిగర్స్ 4/3గా నమోదు చేసింది.

* 2022 టీ20 ఆసియా కప్‌లో 6 ఇన్నింగ్స్‌లో 217 పరుగులు చేసి అత్యధిక రన్‌స్కోరర్‌గా నిలిచింది.

ముఖ్యమైన మైలురాళ్లు

* 2012-13: 12 సంవత్సరాల వయస్సులో మహారాష్ట్ర అండర్-19 జట్టులో ఎంపిక.

* నవంబర్ 2017: సౌరాష్ట్రపై అండర్-19 వన్డేలో 202* పరుగులు చేసి చరిత్ర సృష్టించింది.

* 13 ఫిబ్రవరి 2018: దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున టీ20 అరంగేట్రం.

* 12 మార్చి 2018: ఆస్ట్రేలియాపై వన్డే అరంగేట్రం.

* డిసెంబర్ 2023: ఇంగ్లాండ్‌పై టెస్ట్ మ్యాచ్‌లో తొలి ప్రదర్శన.

* 2023 WPL వేలం: ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను ₹2.20 కోట్లకు కొనుగోలు చేసింది.

* సెప్టెంబర్ 2025: స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు రెండు అంతర్జాతీయ సెంచరీలతో, ఇంగ్లాండ్‌పై విజయంలో కీలక పాత్రతో జట్టులో చేరింది.

55
వ్యక్తిగత జీవితం, నికర సంపద

జెమిమా స్నేహపూర్వకంగా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తిగా ప్రసిద్ధి. ఆమె కుటుంబం ఆమెకు బలమైన ఆధారం — తండ్రి ఇవాన్ మార్గదర్శకుడు, తల్లి లావిటా, ఇద్దరు సోదరులు ఇనాక్, ఎలీ ఎప్పుడూ అండగా ఉన్నారు. పేరు, గుర్తింపు పెరిగినా, జెమిమా విద్య, క్రీడ రెండింటినీ స‌మానంగా కొనసాగించింది. హాకీ, క్రికెట్ అనుభవం ఆమెకు క్రీడలో విస్తృత దృష్టిని ఇచ్చింది.

నికర సంపద (Net Worth):

2025 నాటికి జెమిమా రోడ్రిగ్స్ అంచనా నికర సంపద రూ. 10 కోట్లు (సుమారు 1–1.3 మిలియన్ అమెరికన్ డాలర్లు).

ఆమె ఆదాయం ప్రధానంగా క్రింది వనరులనుంచి వస్తుంది.

* BCCI సెంట్రల్ కాంట్రాక్ట్

* మ్యాచ్ ఫీజులు

* WPL, WBBL వంటి లీగ్‌ల నుంచి జీతాలు

* బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ప్రకటనలు

Read more Photos on
click me!

Recommended Stories