నువ్వేం అంత అందంగా లేవు! బుమ్రాని ఎలా పడేశావ్... నెటిజన్ ప్రశ్నకు సంజన గణేశన్ స్ట్రాంగ్ కౌంటర్...

First Published | Nov 9, 2022, 9:35 AM IST

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్‌ని ప్రేమించి పెళ్లాడాడు.  2021లో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ మధ్యలో జస్ప్రిత్ బుమ్రా సడెన్ బ్రేక్ తీసుకోవడంతో అతని పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. అయితే బుమ్రా పెళ్లి చేసుకునేది ఎవరిని? అనే విషయంలో మాత్రం ఆఖరి వరకూ తీవ్రమైన సస్పెన్స్ కొనసాగింది...

సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌, జస్ప్రిత్ బుమ్రా ప్రేమలో ఉన్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. దీంతో బుమ్రా, అనుపమనే పెళ్లాడబోతున్నాడా? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగింది. న్యూస్ ఛానెళ్లలో ఈ విషయం గురించి పెద్ద చర్చే జరిగింది...

ఆఖరికి స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్‌తో పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. అప్పుడెప్పుడో ఓ ఇంటర్వ్యూ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం, స్నేహంగా మారి... కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలి, పెళ్లి పీటలు ఎక్కేలా చేసింది...
 


భారత జట్టులో చాలా రిజర్వు ప్లేయర్ అంటే జస్ప్రిత్ బుమ్రానే. వికెట్లు తీసిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్నా, మిగిలిన సందర్భాల్లో చాలా సైలెంట్‌గా ఉంటాడు ఈ ముంబై బౌలర్... భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా బుమ్రా చాలా నెమ్మదస్తుడని, సరదాకి ఏదైనా మాట అన్నా కూడా ఫీల్ అయిపోతాడని కామెంట్ చేశాడు...
 

అయితే పెళ్లైన తర్వాత జస్ప్రిత్ బుమ్రాలో చాలా మార్పు కనిపిస్తోంది. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌తో రహస్య ప్రేమాయణం నడిపి, పెళ్లి చేసుకున్న జస్ప్రిత్ బుమ్రా... ఇప్పుడు భార్యతో కలిసి ఫన్నీ వీడియోలు చేస్తూ  వాటిని అభిమానులతో పంచుకుంటున్నాడు... బుమ్రాలోని ఈ కోణం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు...

గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే రెండు మ్యాచులు ఆడగానే బుమ్రా గాయం తిరగబెట్టింది. దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు జస్ప్రిత్ బుమ్రా...

Image Credit: Sanjana Ganesan Instagram

బుమ్రా సతీమణి సంజన గణేశన్ మాత్రం టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి స్పోర్ట్స్ యాంకర్‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. తాజాగా స్టేడియంలో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సంజన గణేశన్. రెడ్ కలర్ డ్రెస్‌లో నవ్వుతూ ఫోజులు ఇచ్చింది మిసెస్ బుమ్రా...
 

ఈ ఫోటోలపై ఓ నెటిజన్... ‘మామ్... నువ్వేం అంత అందంగా లేవు, మరి బుమ్రాని ఎలా పడేశావు...’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంజన అదిరిపోయే రేంజ్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘చెప్పులాంటి ముఖాలతో కొందరు దేశం మీద పడి తిరగడం లేదా... అలాగే...’ అంటూ రిప్లై ఇచ్చింది సంజన గణేశన్... ఎదుటివారి అందంపై కామెంట్ చేసేముందు ముఖం అద్దంలో చూసుకోవాలంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సంజన... 

Image Credit: Jasprit Bumrah Instagram

ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న జస్ప్రిత్ బుమ్రాకి గడసరి అయిన సంజన గణేశన్ భార్యగా దొరికిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ పిల్లతో బుమ్రా ఎలా తట్టుకుంటాడోనని కొందరు అంటుంటే... ఇద్దరికీ భలే సెట్ అవుతుందని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు... 

Latest Videos

click me!