ఇంగ్లాండ్‌‌కు వరుస షాకులు.. వేధిస్తున్న గాయాలు.. భారత్‌తో సెమీస్ కు ముందు మరో ఆటగాడికి గాయం

First Published | Nov 8, 2022, 6:18 PM IST

T20 World Cup 2022: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఈనెల 10న అడిలైడ్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కంటే ముందే ఇంగ్లాండ్ కు  వరుస షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్ గాయపడగా ఇప్పుడు మరో పేసర్... 

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుతో సెమీస్ ఆడేందుకు ముందే ఇంగ్లాండ్ కు  వరుస షాకులు తాకుతున్నాయి.  ఇప్పటికే గాయం కారణంగా  స్టార్ బ్యాటర్  డేవిడ్ మలన్ మ్యాచ్ కు దూరమవగా తాజాగా మరో  ఆటగాడు కూడా గాయంతో మ్యాచ్ ఆడేది అనుమానంగానే మారింది. 

ఇంగ్లాండ్  పేసర్ మార్క్ వుడ్  మంగళవారం ‘బాడీ స్టిఫ్‌నెస్’ (శారీరకంగా ధృడంగా లేకపోవడం) తో బాధపడుతున్నాడు. మంగళవారం ఇంగ్లాండ్ జట్టు ట్రైనింగ్ సెషన్ కు రాగా వుడ్ మాత్రం  రాలేదు. అయితే అతడి గాయం పెద్దది కానప్పటికీ ఈ బౌలర్ భారత్  తో మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది అనుమానమే. 


భారత్-ఇంగ్లాండ్ మధ్య ఈనెల 10న అడిలైడ్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కంటే ముందే వుడ్ కు ఫిట్నెస్ టెస్టును నిర్వహించి అందులో అతడు ఫిట్ గా ఉన్నాడని తేలితేనే  భారత్ తో మ్యాచ్ కు ఆడిస్తారు. లేకుంటే మలన్ మాదిరిగానే వుడ్ కూడా ఈ మ్యాచ్ కు దూరం కాక తప్పదు. 

ఒకవేళ మార్క్ వుడ్ ఆడకుంటే ఈ మ్యాచ్ కు ఇంగ్లాండ్.. తైమల్ మిల్స్ ను ఆడించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఇదిలాఉండగా  మార్క్ వుడ్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. 

బుల్లెట్ వంటి వేగంతో బంతులు విసిరే మార్క్ వుడ్ దూరమైతే అది ఇంగ్లాండ్ కు  కోలుకోలేని ఎదురుదెబ్బే. ఈ టోర్నీలో  మార్క్ వుడ్  తన వేగంతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. ఈ మేరకు ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితానే ఇందుకు నిదర్శనం.  ఈ టోర్నీలో 10 ఫాస్టెస్ట్ డెలివరీస్ లో మార్క్ వుడ్ వేసిన బంతులే ఆరు వుడ్ వే కావడం గమనార్హం. 

మార్క్ వుడ్.. ఈ టోర్నీలో గంటకు 154.74 కెఎంపీహెచ్ వేగంతో  అత్యంత వేగవంతమైన (ఇప్పటివరకు) డెలివరీ విసిరాడు.  రెండో స్థానంలో లాకీ ఫెర్గూసన్ (154.55 కెఎంపీహెచ్) ఉండగా.. 154.48 కెఎంపీహెచ్ తో  వుడ్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాడు. నోర్త్జ్ 154.31 కెఎంపీహెచ్ తో ఐదో స్థానంలో ఉండగా.. 6, 9, 10 స్థానాల్లో ఉన్న డెలివరీలు కూడా వుడ్ వే కావడం విశేషం. 

Latest Videos

click me!