Bumrah vs Shami: బుమ్రా vs షమీ.. ఇంగ్లాండ్‌లో ఎవరు బెస్ట్?

Published : May 17, 2025, 09:47 PM IST

Jasprit Bumrah vs Mohammed Shami: వచ్చే నెల జూన్‌లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తోంది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలపైనే అందరి చూపు ఉంది. ఇంగ్లాండ్‌లో ఎవరి రికార్డు బాగుందో ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
16
Bumrah vs Shami: బుమ్రా vs షమీ.. ఇంగ్లాండ్‌లో ఎవరు బెస్ట్?

Jasprit Bumrah vs Mohammed Shami: జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఇద్దరూ భారత జట్టు బౌలింగ్‌లో కీలకమైనవారు. వీరిద్దరూ కలిసి ఆడితే జట్టు మరింత బలంగా మారుతుంది. ఇద్దరికీ వికెట్లు తీసే సత్తా ఉంది. స్టార్ బ్యాటర్లు సైతం వీరి బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుంటారు.

26
Will Bumrah and Shami be there for the England tour?

ఇంగ్లాండ్ పర్యటనకు ఈ ఇద్దరు స్టార్లు ఎంపిక? 

వచ్చే నెల జూన్‌లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇంకా భారత జట్టు ప్రకటించలేదు. షమీ, బుమ్రాలు జట్టులో ఉంటారని సమాచారం. ఎందుకంటే రిటైర్మెంట్ తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రూపంలో ఇద్దరు సీనియర్ స్టార్ బ్యాటర్లను భారత్ కోల్పోయింది. కాబట్టి బౌలింగ్ విభాగంలో షమీ, బుమ్రా సేవలు  ఉపయోగించుకోవడం కీలకం. 

36
Bumrah and Shami have injury problems

ఇద్దరికీ గాయాలే సమస్యలు

భారత జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్న షమీ, బుమ్రా ఇద్దరూ గాయాలతో బాధపడుతున్నారు. ఇంగ్లాండ్‌లోని 5 టెస్టులకు ఇద్దరూ అందుబాటులో ఉంటారా లేదా అనేది చూడాలి.

46
Bumrah and Shami are both dangerous bowlers in England.

ఇంగ్లాండ్‌లో ఇద్దరూ డేంజర్

ఇంగ్లాండ్‌లాంటి ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై బుమ్రా, షమీ ఇద్దరూ ప్రత్యర్థి జట్లకు అత్యంత ప్రమాదకరమైన బౌలర్లుగా ఉంటారు. ఇద్దరూ అక్కడ అనేక రికార్డులు సృష్టించారు. చాలా మ్యాచ్ లను గెలిపించారు. 

56
How are Bumrah's England records?

బుమ్రా ఇంగ్లాండ్ రికార్డులు ఎలా ఉన్నాయి? 

బుమ్రా మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రమాదకర బౌలర్. టెస్టుల్లో అతని ప్రత్యేకతే వేరు. ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు 8 టెస్టుల్లో 15 ఇన్నింగ్స్‌లలో 37 వికెట్లు తీశాడు. కీలక సమయంలో అద్భుతమైన బౌలింగ్ తో వికెట్లు తీయడమే కాదు పరుగులు చేయకుండా ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టించడంలో కూడా బుమ్రా ప్రత్యేకత వేరని చెప్పొచ్చు. 

66
How are Shami's England records?

షమీ ఇంగ్లాండ్ రికార్డులు ఎలా ఉన్నాయి? 

ఇంగ్లాండ్ తో మహ్మద్ షమీ కూడా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. షమీ ఇంగ్లాండ్‌లో అదరగొట్టే ఇన్నింగ్స్ లు చూపించాడు. అక్కడ 14 టెస్టుల్లో 25 ఇన్నింగ్స్‌లలో 40 వికెట్లు తీశాడు. 

ఇంగ్లాండ్‌లో బుమ్రా 2 సార్లు 5 వికెట్లు సాధించాడు. షమీ ఐదు వికెట్ల క్లబ్ లో చేరలేదు కానీ,  అతనికి ఆ సత్తా ఉంది.

Read more Photos on
click me!