ముగిసిన మొదటి రోజు ఆట... భారీ స్కోరు దిశగా ఆసీస్... 5 వికెట్లు తీసిన భారత బౌలర్లు...

Published : Jan 15, 2021, 01:07 PM IST

దుర్బేధ్యమైన గబ్బా టెస్టులో ఏ మాత్రం అనుభవం లేని భారత బౌలర్లు అద్భుతంగా పోరాడుతున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. కామెరూన్ గ్రీన్ 28 పరుగులతో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. యంగ్ బ్యాట్స్‌మెన్ లబుషేన్ సెంచరీతో చెలరేగగా మాథ్యూ వేడ్ 45, స్టీవ్ స్మిత్ 36 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ తీశారు.  

PREV
115
ముగిసిన మొదటి రోజు ఆట... భారీ స్కోరు దిశగా ఆసీస్... 5 వికెట్లు తీసిన భారత బౌలర్లు...

ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసి ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ ఇచ్చాడు భారత బౌలర్ మహ్మద్ సిరాజ్... 

215

మొదటి ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు డేవిడ్ వార్నర్... 

315

ఆ తర్వాత కొద్దిసేపటికే 5 పరుగులు చేసన మార్కస్ హార్రీస్ కూడా అవుట్ అయ్యాడు....

415

9వ ఓవర్‌లో బాల్ అందుకున్న శార్దూల్ ఠాకూర్, మొదటి బంతికే హార్రీస్‌ను పెవిలియన్ చేర్చాడు. 

515

ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్లకే అవుట్ కావడంతో 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా...

615

సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, లబుషేన్ కలిసి మూడో వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

715

అయితే 77 బంతుల్లో 5 ఫోర్లతో36 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్‌కి పంపించాడు.

815

సుందర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు స్టీవ్ స్మిత్...

915

ఆ తర్వాత లబుషేన్, మాథ్యూ వేడ్ కలిసి నాలుగో వికెట్‌కి 113 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...

1015

లబుషేన్ 204 బంతుల్లో 9 ఫోర్లతో 108 పరుగులు చేసి, టెస్టు కెరీర్‌లో ఐదో సెంచరీ నమోదుచేశాడు...

1115

87 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేసిన మాథ్యూ వేడ్‌ను నటరాజన్ అవుట్ చేశాడు...

1215

నటరాజన్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు వేడ్. నటరాజన్‌కి టెస్టుల్లో ఇదే తొలి వికెట్.

1315

ఆ తర్వాతి ఓవర్‌లోనే సెంచరీతో చెలరేగిన లబుషేన్‌ను కూడా అవుట్ చేశాడు నటరాజన్. నట్టూ బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చాడు లబుషేన్.

1415

ఆ తర్వాత కామెరూన్ గ్రీన్, టిమ్ పైన్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు... ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి అజేయంగా 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

1515

8వ ఓవర్ వేస్తూ భారత బౌలర్ నవ్‌దీప్ సైనీ గాయపడ్డాడు... అతన్ని స్కానింగ్ కోసం తరలించింది భారత జట్టు. రిపోర్టుల ఆధారంగా అతను రేపు ఆడతాడా? లేదా? అనేది తేలనుంది.

click me!

Recommended Stories