నీకు 10 ఏళ్లు ఇస్తా తమ్ముడు! ఇందులో సగం అయినా పట్టగలవేమో చూడు... శుబ్‌మన్ గిల్‌తో విరాట్ కోహ్లీ...

Published : Feb 04, 2023, 11:32 AM ISTUpdated : Feb 04, 2023, 11:35 AM IST

టీమిండియాలో ఫ్యూచర్ త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు శుబ్‌మన్ గిల్. టెస్టుల్లో, వన్డేల్లో తాజాగా టీ20ల్లో అదరగొడుతున్న శుబ్‌మన్ గిల్, టీమిండియాలో విరాట్ కోహ్లీ ప్లేస్‌ని రిప్లేస్ చేయగల సత్తా ఉన్న ఆటగాడిగా మన్ననలు అందుకున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ మధ్య జరిగిన ఓ సంఘటనను బయటపెట్టాడు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...

PREV
17
నీకు 10 ఏళ్లు ఇస్తా తమ్ముడు! ఇందులో సగం అయినా పట్టగలవేమో చూడు... శుబ్‌మన్ గిల్‌తో విరాట్ కోహ్లీ...
Image credit: PTI

అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన శుబ్‌మన్ గిల్, 23 ఏళ్ల వయసులో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. టీమిండియా తరుపున టీ20ల్లో టాప్ స్కోరర్‌గానూ విరాట్ కోహ్లీ 122 పరుగుల రికార్డును లేపేశాడు శుబ్‌మన్ గిల్...
 

27
Image credit: PTI

‘మార్చి 2021లో ఇంగ్లాండ్ జట్టు, భారత పర్యటనకు వచ్చింది. నాలుగో టెస్టు కోసం అహ్మదాబాద్‌లో ఉన్నాం. నరేంద్ర మోదీ స్టేడియంలో అదే మొదటి మ్యాచ్. అదీకాకుండా భారత్‌లో జరిగే రెండో డే నైట్ టెస్టు. అప్పటికి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మాకు చోటు కన్ఫార్మ్ కాలేదు...

37

ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకి చాలా అవసరం. పింక్ టెస్టు కావడంతో స్టేడియంలో సీట్లకు పింక్ కలర్ వేశారు. కరోనా నిబంధనల కారణంగా చాలా తక్కువ మందికి మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పించారు. ఓ ఛైర్‌కి పింక్ కలర్ వేసి, మరో ఛైర్‌ని నార్మల్‌గా వదిలేశారు... ఈ విషయంపై చాలా పెద్ద చర్చే నడిచింది..

47

పింక్ బాల్ టెస్టులో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బంతి ఏ దిశలో వస్తుందో పసికట్టడం చాలా కష్టం.  అందుకే ఫీల్డింగ్ సెషన్ సమయంలో విరాట్ కోహ్లీ, నాతో కలిసి క్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సెషన్‌లో దాదాపు 200 క్యాచులను అందుకున్నాడు....

57
Virat Kohli-Shubman Gill

రేపు టెస్టు అనగా ప్రాక్టీస్ సెషన్స్‌లో అంత కష్టపడడం రిస్క్ అని నేను చెప్పినా విన్లేదు. విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు శుబ్‌మన్ గిల్ కొద్ది దూరంలో నిలబడి గమనిస్తూ ఉన్నాడు. కొంత సేపటి తర్వాత అతను కూడా వచ్చి క్యాచ్ ప్రాక్టీస్‌లో పాల్గొనాలని అనుకున్నాడు...

67
virat kohli catch


శుబ్‌మన్ గిల్ రాగానే, విరాట్ కోహ్లీ నవ్వుతూ అతని వైపు చూసి, ‘నీకు 10 ఏళ్లు ఇస్తా.. తమ్ముడు! ఇందులో సగం క్యాచులైనా నువ్వు పట్టుకో చూద్దాం...’ అంటూ నవ్వాడు. విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచులు అలాంటివి. 

77

అప్పటికి సెషన్స్ టైమ్ అయిపోవడంతో అందరం కలిసి టీమ్ బస్సులో బయలుదేరి, 10 నిమిషాల్లో హోటల్‌కి చేరిపోయాం...’ అంటూ తన ఆటోబయోగ్రఫీ ‘కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్’లో రాసుకొచ్చాడు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...

Read more Photos on
click me!

Recommended Stories