టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా స‌రికొత్త రికార్డు

First Published | Feb 3, 2024, 6:14 PM IST

India vs England: ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రా విజృంభించాడు. 6 కీల‌క‌మైన వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ దెబ్బ‌కొట్టాడు. టెస్టు క్రికెట్ లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. 

Jasprit Bumrah

India vs England: ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త్ అధిప‌త్యం కొన‌సాగుతోంది. తొలి రోజు బ్యాటింగ్ లో రాణించిన భార‌త్ రెండో రోజు బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను దెబ్బ‌కొట్టింది.

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం లో ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త బౌల‌ర్లు జ‌స్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ విజృంభించారు.


టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా త‌న‌ అద్భుత‌మైన బౌలింగ్.. యార్క‌ర్లలో ఇంగ్లాండ్ పై విరుచుకుప‌డ్డాడు. కీల‌క‌మైన ఆరు వికెట్లు తీసుకున్నాడు. అద్భుతమైన యార్కర్ తో ఒల్లీ పోప్ ఔట్ కాగా, రెండు వికెట్లు ఎగిరిప‌డ్డాయి. 

Jasprit Bumrah,Ollie Pope

ఈ మ్యాచ్ లో 6 వికెట్లు తీయ‌డం ద్వారా జ‌స్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్ లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌల‌ర్ గా రికార్డు సృష్టించాడు. 

వైజాగ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో బుమ్రా 6 వికెట్లు తీయ‌డంతో.. టెస్టుల్లో అత్యంత వేగంగా (34 మ్యాచ్ ల‌లో) 150 వికెట్లు తీసిన పేస‌ర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. 

Jasprit Bumrah

మొత్తంగా (స్పిన్, పెస్ బౌలింగ్) అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో అశ్విన్ (29 మ్యాచ్ లు), జ‌డేజా (32 మ్యాచ్ లు)  బుమ్రా కంటే ముందున్నారు. అయితే, అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన తొలి ఐదుగురు బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా ఒక్క‌డు మాత్ర‌మే పేస‌ర్ కావ‌డం విశేషం. 

Jasprit Bumrah

టెస్టుల్లో  150+ వికెట్లు తీసుకున్న బౌల‌ర్ల అత్యుత్త‌మ స‌గటులో  కూడా బుమ్రా రికార్డు సృవ‌ష్టిస్తున్నాడు. ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు.
 
Best avg in Tests (150+ wickets)
16.43 సిద్ బర్న్స్
20.28 జస్ప్రీత్ బుమ్రా
20.53 అలాన్ డేవిడ్సన్
20.94 మాల్కం మార్షల్
20.97 జోయెల్ గార్నర్
20.99 కర్ట్లీ ఆంబ్రోస్

Latest Videos

click me!