తేలిపోయిన జస్ప్రిత్ బుమ్రా, భువీ... టీ20 వరల్డ్ కప్‌ ముందు వార్నింగ్ సైరన్స్...

First Published Sep 25, 2022, 9:51 PM IST

జస్ప్రిత్ బుమ్రా ఉండి ఉంటేనా..! ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా వరుస పరాజయాల తర్వాత వినిపించిన మాట. బుమ్రా ఉండి ఉంటే, ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడని! భారత జట్టుకి విజయాలు అందించేవాడని అభిమానుల నమ్మకం. అయితే బుమ్రా కమ్‌బ్యాక్ ఆశించిన రేంజ్‌లో జరగలేదు...
 

bumrah

పూర్తి ఫిట్‌నెస్ సాధించని కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20లో జస్ప్రిత్ బుమ్రా బరిలో దిగలేదు. నాగ్‌పూర్‌లో బుమ్రా రీఎంట్రీ ఇచ్చినా, వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ చెరో 8 ఓవర్ల పాటే సాగింది. అందులో బుమ్రా రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు...

Jasprit Bumrah

తన ట్రేడ్ మార్క్ యార్కర్‌తో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ని బోల్తా కొట్టించిన జస్ప్రిత్ బుమ్రా, రెండు ఓవర్లలో 23 పరుగులు సమర్పించాడు. ఆట పూర్తి ఓవర్ల పాటు సాగలేదు కాబట్టి దీన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌లో ఏకంగా 4 ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకున్నాడు జస్ప్రిత్ బుమ్రా..

Jasprit Bumrah

ఇంతకుముందు కెరీర్ ఆరంభంలో 2016లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 47 పరుగులు సమర్పించుకున్న జస్ప్రిత్ బుమ్రా, కెరీర్‌లో తొలిసారిగా 50 పరుగులు ఇచ్చాడు. ఇది భారతజట్టు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది...

ఇన్ని రోజులు బుమ్రా వస్తాడు, టీమిండియాని గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్న అభిమానులు, అతని రీఎంట్రీ ఇలా జరగడంతో ఆశ్చర్యపోతున్నారు. మరో వైపు భువనేశ్వర్ కుమార్ కూడా ఇప్పట్లో ట్రాక్ ఎక్కేలా కనిపించడం లేదు...

Bhuvi

ఆసియా కప్ 2022 నుంచి ఇప్పటిదాకా డెత్ ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు భువీ. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 19, శ్రీలంకతో మ్యాచ్‌లో 14 పరుగులు సమర్పించిన భువనేశ్వర్ కుమార్... ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20లో 2 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి పర్వాలేదనిపించాడు. 

Bhuvi

అయితే ఆఖరి టీ20లో ఏకంగా 21 పరుగులు ఇచ్చిన భువీ... గత 5 డెత్ ఓవర్లలో 5 ఓవర్లు వేసి 84 పరుగులు సమర్పించుకున్నాడు. అతని ఎకానమీ 16.80 గా ఉంది. భువీ ట్రాక్‌లోకి రాకపోవడం, బుమ్రా తిరిగి రిథమ్‌లోకి రావడానికి టైమ్ పడుతుండడం భారత అభిమానులను కలవరబెడుతోంది...

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపికైన దీపక్ చాహార్ ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మహ్మద్ షమీ కరోనా కారణంగా ఈ సిరీస్‌కే దూరమయ్యాడు. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో ఆడించడానికి భారత జట్టు దగ్గర జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది...

Harshal Patel

ఇంతకుముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డల మీద అద్భుతాలు చేసిన జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లోకి రాకపోతే టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకి కష్టాలు తప్పవంటున్నారు క్రికెట్ విశ్లేషకులు... 

click me!