ధోనీ మానియా ముందు నేను నిలబడలేకపోయా... తన క్రికెట్ కెరీర్‌పై దినేశ్ కార్తీక్ కామెంట్...

First Published Feb 28, 2023, 3:41 PM IST

టీమిండియా ఆడిన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో సభ్యుడిగా ఉన్నాడు దినేశ్ కార్తీక్. ఆ మ్యాచ్‌లో ఆడి 21 మంది ప్లేయర్లతో పాటు రిజర్వు బెంచ్‌లో ఉన్న ప్లేయర్లు కూడా రిటైర్ అయిపోయారు కానీ దినేశ్ కార్తీక్ మాత్రం ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. 20 ఏళ్లుగా సుదీర్ఘ కెరీర్ కొనసాగిస్తున్నా, కార్తీక్ ఆడిన మ్యాచుల సంఖ్య చాలా తక్కువ...

Dinesh Karthik


కెరీర్ ఆరంభంలో టీమిండియాలో యంగ్ స్టార్‌గా కనిపించిన దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి కొన్ని మ్యాచులు కూడా ఆడాడు. అయితే వికెట్ కీపింగ్ బ్యాటర్ కావడం వల్ల దినేశ్ కార్తీక్ కెరీర్‌ అనుకున్నంత సాఫీగా సాగలేదు...

Image credit: Getty

రికార్డు స్థాయిలో వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీకి ముగ్గురు వికెట్ కీపర్లను ఎంపిక చేసింది టీమిండియా. మహేంద్ర సింగ్ ధోనీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌తో పాటు కెఎల్ రాహుల్ కూడా వికెట్ కీపరే... అయితే ఈ మెగా టోర్నీలో వీరిలో ఏ ఒక్కరూ కూడా ఆకట్టుకోలేకపోయారు..

Latest Videos


Image credit: PTI

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయిన దినేశ్ కార్తీక్, రిటైర్మెంట్‌కి ముందే కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు. 2021 ఇంగ్లాండ్ టూర్‌లో దినేశ్ కార్తీక్ కామెంటరీయే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది...
 

కామెంటేటర్‌గా మారిన సమయంలో 2003-2019 అని దినేశ్ కార్తీక్ కెరీర్‌, అక్కడితో ముగిసినపోయినట్టు చూపించింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. అయితే ఆ తర్వాతే సీన్ మారింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడి టీమిండియాలోకి తిరిగొచ్చాడు కార్తీక్...

Image credit: PTI

మూడేళ్ల గ్యాప్ తర్వాత టీమ్‌లోకి వచ్చిన దినేశ్ కార్తీక్ కోసం రిషబ్ పంత్‌ని కూడా సైడ్ చేసేసింది టీమిండియా. టీ20ల్లో దినేశ్ కార్తీక్ టీమిండియాకి ప్రధాన వికెట్ కీపర్‌గా మారాడు. అయితే ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేక మళ్లీ టీమ్‌లో చోటు కోల్పోయాడు దినేశ్ కార్తీక్...
 

‘టీమిండియా తరుపున నాకు వచ్చిన అవకాశాలకు నేను న్యాయం చేశాను. అయితే ధోనీ చాలా పెద్ద ప్లేయర్‌గా మారిపోయాడు. ధోనీ మానియా ముందు ఎవ్వరూ నిలవలేకపోయారు. మాహీతో పోటీపడాలంటే అయ్యే పనేనా....

అందుకే తొలుత వన్డేల్లో నా ప్లేస్‌ కొట్టేసిన ధోనీ, ఆ తర్వాత టెస్టుల్లో, టీ20లకు కూడా నన్ను దూరం చేశాడు. అయితే ఛేజింగ్‌లో బెస్ట్ బ్యాటర్ అవ్వాలనే నా కల తీర్చుకోవడానికి నాకు చాలా సార్లు అవకాశం వచ్చింది...

అయితే ధోనీ ఉన్నాడా? లేడా? అని చూసుకోవడంతోనే కాలం గడిచిపోయింది. ధోనీ టీమ్‌లో పర్ఫెక్ట్‌గా సెటిల్ అయ్యాడు. ఎలాంటి తప్పులు చేయకుండా మూడు ఫార్మాట్లలో రాణించాడు. టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి వెళ్లి సెంచరీ చేశాడు...

Dhoni Batting

టెస్టు క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లో 85 పరుగులు చేశాడు. కీపింగ్ బ్రిలియెంట్‌గా చేస్తాడు. అన్నింటికీ మించి ధోనీ ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. జనాలు అతన్ని కోరుకున్నారు. దాంతో నాలాంటి వికెట్ కీపర్లు అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది...’ అంటూ చెప్పుకొచ్చాడు దినేశ్ కార్తీక్...

click me!