బ్రిస్బేన్‌లోని గబ్బా టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు చేతుల్లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్, ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఘోర పరాజయం దిశగా అడుగులు వేస్తోంది...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473/9 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లబుషేన్ 103 పరుగులతో సెంచరీ పూర్తి చేసుకోగా, డేవిడ్ వార్నర్ 95, స్టీవ్ స్మిత్ 93 పరుగులు చేసి సెంచరీలు మిస్ చేసుకున్నారు...
29
అయితే తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్‌ను కెప్టెన్ జో రూట్, డేవిడ్ మిలాన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు... ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 138 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...
39
టెస్టు కెప్టెన్‌గా 37వ సారి 50+ స్కోరు చేసి, విరాట్ రికార్డును సమం చేసిన జో రూట్, టెస్టు కెరీర్‌లో 75వ సారి 50+ స్కోర్ చేసిన 13వ ప్లేయర్‌గా, రెండో ఇంగ్లాండ్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు అలెస్టర్ కుక్ (90 సార్లు) మాత్రమే ఈ ఫీట్ సాధించాడు.
49
డిన్నర్ బ్రేక్ తర్వాత 116 బంతుల్లో 7 ఫోర్లతో 62 పరుగులు చేసిన జో రూట్‌ను గ్రీన్ అవుట్ చేయడంతో మళ్లీ ఇంగ్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. 157 బంతుల్లో 10 ఫోర్లతో 80 పరుగులు చేసిన డేవిడ్ మలాన్ కూడా ఆ వెంటనే అవుట్ అయ్యాడు.
59
150/2 స్కోరు వద్ద భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపించిన ఇంగ్లాండ్, 19 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయి 169/6 స్కోరుకి చేరుకుంది. ఈ దశలో బెన్ స్టోక్స్ 34, క్రిస్ వోక్స్ 24 పరుగులు చేసినా వికెట్ల పతనాన్ని ఆపలేకపోయారు.
69
236 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకి 237 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. 150వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న స్టువర్ట్ బ్రాడ్, రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది టెస్టు కెరీర్‌లో 50 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు.
79
13 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన జేమ్స్ అండర్సన్, టెస్టు కెరీర్‌లో 100వ సారి నాటౌట్‌గా నిలిచి, అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు...
89
167వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న జేమ్స్ అండర్సన్, 100 సార్లు టెస్టుల్లో నాటౌట్‌గా నిలిచిన మొదటి ప్లేయర్‌గా కాగా విండీస్ క్రికెటర్ కోర్ట్నీ వాల్స్ 61 సార్లు, ముత్తయ్య మురళీధరన్ 56 సార్లు నాటౌట్‌గా నిలిచి, అండర్సన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు...
99
బ్రాడ్ వికెట్ తీసిన మిచెల్ స్టార్క్, పింక్ బాల్ టెస్టుల్లో 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 9 డే నైట్ టెస్టుల్లో స్టార్క్ ఈ ఫీట్ సాధించగా ఆసీస్ బౌలర్లు జోష్ హజల్‌వుడ్, నాథన్ లియాన్ చెరో 32 వికెట్లు తీసి తర్వాతి స్థానాల్లో నిలిచారు...