కెఎల్ రాహుల్‌కి బంపర్ ఆఫర్... రోహిత్ శర్మ కారణంగా వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ...

First Published Dec 18, 2021, 3:11 PM IST

టీమిండియా స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్‌కి అద్భుత అవకాశం వరించింది. సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ పొజిషన్ కెఎల్ రాహుల్‌కి దక్కినట్టు సమాచారం...

గత రెండేళ్లుగా టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారాడు కెఎల్ రాహుల్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గైర్హజరీలో టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా కెఎల్ రాహుల్‌కి ఉంది...

టెస్టు వైస్ కెప్టెన్‌గా అజింకా రహానేని తప్పించి, సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‌కి రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

అయితే ఎప్పటిలాగే ఫారిన్ టూర్‌కి ముందు గాయపడిన రోహిత్ శర్మ, టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో గుజరాత్ ఓపెనర్, భారత్-ఏ టీమ్ కెప్టెన్ ప్రియాంక్ పంచల్‌కి తుదిజట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే...

దీంతో అజింకా రహానేకి తిరిగి వైస్ కెప్టెన్సీ అప్పగిస్తారా? లేక సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారాకి టెస్టు వైస్ కెప్టెన్సీ అప్పగిస్తారా? అనే చర్చ నడిచింది...

గత నాలుగేళ్లుగా టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తూ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న రవిచంద్రన్ అశ్విన్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ దక్కడం భావ్యమనే టాక్ కూడా వినిపించింది...

అయితే టీమిండియా సెలక్టర్లు మాత్రం కెఎల్ రాహుల్‌కే టెస్టు వైస్ కెప్టెన్సీ పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. నిజానికి రెండేళ్లుగా టెస్టు టీమ్‌కి దూరమైన కెఎల్ రాహుల్, ఆసీస్ టూర్‌లోనూ ఒక్క మ్యాచ్ ఆడలేకపోయాడు...

మూడో టెస్టుకి ముందు కెఎల్ రాహుల్ గాయపడడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా కెఎల్ రాహుల్‌కి అవకాశం దక్కలేదు...

ఇంగ్లాండ్ టూర్‌లో తొలి టెస్టు ఆరంభానికి ముందు శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయపడడంతో అనుకోకుండా రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, ఆ సిరీస్‌లో అద్భుతంగా రాణించి టెస్టు సిరీస్‌లో చోటు పదిలం చేసుకున్నాడు...

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు గాయపడిన కెఎల్ రాహుల్, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకావడం హాట్ టాపిక్ అయ్యింది...

రీఎంట్రీ తర్వాత కేవలం నాలుగంటే నాలుగు టెస్టు మ్యాచులు మాత్రమే ఆడిన కెఎల్ రాహుల్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ ఎలా అప్పగిస్తారని విమర్శిస్తున్నారు అభిమానులు...

అసలు ఏ మాత్రం కెప్టెన్సీ లక్షణాలు లేని కెఎల్ రాహుల్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ అప్పగించేకంటే రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ లేదా కనీసం జస్ప్రిత్ బుమ్రాకి అయినా ఆ పొజిషన్ ఇస్తే బాగుంటుందని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...

రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ సెలక్టర్లు, ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైస్ కెప్టెన్‌ ఎవరనేది ప్రకటించలేదు...

అయితే కెఎల్ రాహుల్‌కే వన్డే, టీ20ల్లో వైస్ కెప్టెన్సీ దక్కవచ్చని టాక్ వినబడుతోంది. రిషబ్ పంత్‌, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ రేసులో ఉన్నా ఆ ఇద్దరి కంటే కెఎల్ రాహుల్‌కే సెలక్టర్ల సపోర్టు ఉందని టాక్ నడుస్తోంది.

click me!