లక్నో ఫ్రాంఛైజీ మెంటర్‌గా గౌతమ్ గంభీర్, హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్... కెఎల్ రాహుల్‌తో పాటు ఆ ఇద్దరినీ..

First Published Dec 18, 2021, 3:32 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న లక్నో ఫ్రాంఛైజీ, మెగా వేలానికి ముందు టీమ్ ఏర్పాటుకి కావాల్సిన ఎత్తులు, పైఎత్తులను మొదలెట్టేసింది. తాజాగా లక్నో టీమ్‌కి మెంటర్‌గా గౌతమ్ గంభీర్ వ్యవహరించబోతున్నాడు...

ఐపీఎల్‌లో గౌతమ్ గంభీర్‌కి అద్భుతమైన రికార్డు ఉంది. కేకేఆర్ కెప్టెన్‌గా రెండు సార్లు టైటిల్స్ గెలిచిన గౌతమ్ గంభీర్, ఢిల్లీ జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు...

కెప్టెన్‌గానే కాకుండా స్వదేశీ ప్లేయర్ల సామర్థ్యాన్ని సరిగా ఎలా వాడుకోవాలో సీనియర్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్‌కి బాగా తెలుసు... 

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు రాబిన్ ఊతప్ప, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే వంటి యువకులు, ఇంగ్లాండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా... గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రాటుతేలినవాళ్లే...

అలాగే ఫ్రాంఛైజీ కోచ్‌గా అద్భుతమైన రికార్డు ఉన్న జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండీ ఫ్లవర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది లక్నో జట్టు...

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకి ఐదేళ్ల పాటు కోచ్‌గా వ్యవహరించిన ఆండీ ఫ్లవర్, పాక్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూసియా జోక్స్ జట్లకి కోచ్‌గా ఉన్నాడు...

ఐపీఎల్‌లో ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ జట్టుకి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన ఆండీ ఫ్లవర్, లక్నో టీమ్‌ని సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీగా తయారుచేయడంలో కీలక పాత్ర పోషిస్తాడని నమ్ముతోంది మేనేజ్‌మెంట్...

అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్, టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను లక్నో జట్టు కొనుగోలు చేసిందని సమాచారం...

కెఎల్ రాహుల్‌కి లక్నో దాదాపు రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని టాక్. కెఎల్ రాహుల్‌తో పాటు అతని స్నేహితుడు, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా లక్నో జట్టు తరుపున ఆడనున్నాడని సమాచారం...

ఈ ఇద్దరితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్, ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌కి లక్నో టీమ్ రూ.16 కోట్లు ఆఫర్ చేసిందని టాక్. వీటిలో ఏది నిజమో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.

click me!