భిన్నంగా ఉండడం మంచిదే! మరీ ఇంత తేడాగా ఉంటేనే కష్టం... హార్ధిక్ పాండ్యాపై ఆగని ట్రోల్స్...

First Published Aug 7, 2023, 10:47 AM IST

ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ రెండూ ఒక్కటి కాదు. ఐపీఎల్‌లో సూపర్ సక్సెస్ సాధించిన చాలామంది క్రికెటర్లు, అంతర్జాతీయ క్రికెట్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అయితే భారత క్రికెట్ బోర్డులో చాలామంది పెద్దలు మాత్రం ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ కంటే గొప్పదిగా భావిస్తారు...

Hardik Pandya

ఐపీఎల్ సక్సెస్ కారణంగానే విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించి, రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ.. 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి ఐపీఎల్ టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్యాని, టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది..

అయితే హార్ధిక్ పాండ్యా చేసిన కామెంట్స్, టీమిండియాకి తేడా కొట్టేస్తున్నాయి. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమిండియా రెండు వేర్వేరు జట్లుగా బరిలో దిగినా, ప్రపంచంలో ఏ టీమ్‌నైనా ఓడించగలదు..’ అంటూ వ్యాఖ్యానించాడు హార్ధిక్ పాండ్యా. పాండ్యా ఎప్పుడైతే ఆ కామెంట్లు చేశాడో అప్పటి నుంచి టీమిండియా పర్పామెన్స్ ఘోరంగా పడిపోయింది..

Latest Videos


ఆఖరికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే మిగిలిన టీమ్ అంతా ఉత్తిదేనని వెస్టిండీస్ పర్యటనలో జరిగిన మొదటి రెండు వన్డే మ్యాచులు నిరూపించాయి. సో కాల్డ్ ఐపీఎల్ స్టార్ల ప్రదర్శన అంతా ఇండియన్ పిచ్‌ల మీదేనని తేలిపోయింది. 

India vs West Indies

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో చిత్తుగా ఓడిన తర్వాత హార్ధిక్ పాండ్యా చేసిన కామెంట్లు మరింత దుమారం రేపాయి. గత పదేళ్లలో భారత జట్టు, వెస్టిండీస్‌లో వన్డే సిరీస్ ఓడిపోలేదు. ఇది ఓడిపోతే ఆ రికార్డు మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది? అని అడిగిన ప్రశ్నకు ‘భిన్నంగా ఉండడం కూడా మంచిదే’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా..
 

Hardik Pandya

ఏ నిమిషాన ఆ కామెంట్ చేశాడో కానీ వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు హార్ధిక్ పాండ్యా..

హార్ధిక్ పాండ్యాకి యాటిట్యూడ్ ఎక్కువ. అది అతన్ని చూసిన ప్రతీ ఒక్కరికీ ఇట్టే అర్థమవుతుంది. అంతేకాకుండా ప్లేయర్‌గా, కెప్టెన్‌గా హార్ధిక్ ఓవర్ కాన్ఫిడెన్స్, బౌలింగ్, బ్యాటింగ్‌లో చేస్తున్న ప్రయోగాలు.. టీమిండియాని దెబ్బ తీస్తున్నాయి. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు చేసిన ఇలాంటి ప్రయోగాలు సూపర్ సక్సెస్ అయ్యాయి..

Hardik Pandya

ఎంతో క్రికెట్ అనుభవం, అంతకుమించి గేమ్ గురించి పూర్తి అవగాహన ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ కూడా కొన్నిసార్లు ఇలాంటి ప్రయోగాలతో చేతులు కాల్చుకున్నాడు. ఈ విషయాన్ని హార్ధిక్ పాండ్యా ఎంత త్వరగా గ్రహించి, ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే.. టీమిండియాకి, అతనికి అంత మంచిదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

బ్యాటుతో రికార్డు లెవెల్లో పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా టీమిండియా ఓడినప్పుడు తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. హార్ధిక్ పాండ్యా ఇదే విధంగా కొనసాగితే, ఫ్యాన్స్ నుంచి మరింత ఘోరంగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

click me!