చాహాల్‌తో ఆ ఓవర్ ఎందుకు వేయించలేదు? హార్ధిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ వల్లే టీమిండియాకి ఓటమి...

Published : Aug 07, 2023, 10:23 AM IST

ఒక్క ఐపీఎల్ టైటిల్‌తో టీమిండియా ఫ్యూచర్ వైట్ బాల్ కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేశాడు హార్ధిక్ పాండ్యా. రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్, జస్ప్రిత్ బుమ్రాలను పక్కనబెట్టేసి.. హార్ధిక్ పాండ్యాని టీ20 కెప్టెన్‌గా కొనసాగిస్తూ వస్తోంది టీమిండియా...  

PREV
18
చాహాల్‌తో ఆ ఓవర్ ఎందుకు వేయించలేదు? హార్ధిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ వల్లే టీమిండియాకి ఓటమి...
Hardik Pandya

హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో వెస్టిండీస్‌ టూర్‌లో రెండో వన్డేలో చిత్తుగా ఓడిన టీమిండియా, మొదటి రెండు టీ20ల్లోనూ విజయాన్ని అందుకోలేకపోయింది.. రెండు మ్యాచుల్లోనూ టీమిండియా విజయానికి చేరువగా వచ్చి, చేజేతులా ఓడింది..

28

మొదటి టీ20లో 30 బంతుల్లో 37 పరుగులు మాత్రమే కావాల్సిన పొజిషన్‌లో ఉన్నప్పుడు వరుస వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవరిని ఎప్పుడు పంపాలనే విషయంలోనూ క్లారిటీ లేదని క్లియర్‌గా తేలిపోయింది..
 

38
Yuzvendra Chahal

మొదటి టీ20లో స్పిన్నర్లు అద్భుతంగా రాణించినా యజ్వేంద్ర చాహాల్‌తో 3 ఓవర్లు మాత్రమే వేయించిన హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌తో అయితే రెండే ఓవర్లు వేయించాడు.. రెండో టీ20లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది..

48

నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీ కారణంగా 36 బంతుల్లో 27 పరుగులు మాత్రమే కావాల్సిన ఈజీ స్థితికి చేరుకుంది వెస్టిండీస్.. యజ్వేంద్ర చాహాల్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. ఇదే మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్..

58

క్రీజులో సెటిల్ అయిపోయిన బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ కావడంతో మ్యాచ్‌ మళ్లీ టీమిండియా వైపు తిరిగింది. అయితే యజ్వేంద్ర చాహాల్‌తో మరో ఓవర్ వేయించే ప్రయత్నం చేయలేదు హార్ధిక్ పాండ్యా. ఇదే టీమిండియా ఓటమికి కారణమైంది. అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఈజీగా షాట్స్ ఆడిన విండీస్ టెయిలెండర్లు, మ్యాచ్‌ని ముగించేశారు..
 

68

‘2007 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ మొదలైంది. 7 సార్లు టీ20 వరల్డ్ కప్ ఆడాం, ఒకే ఒక్కసారి ఫైనల్ ఆడాం. ఐసీసీ టైటిల్ గెలవాలనే కసి, ఆకలి మనవాళ్లలో కనిపించడం లేదు. యజ్వేంద్ర చాహాల్ 16వ ఓవర్‌లో 2 వికెట్లు తీసి, మ్యాచ్‌ని ఇండియా వైపు తిప్పాడు..

78

అతనికి మరో ఓవర్ ఇచ్చేందుకు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకి మనసు ఒప్పలేదు. వెస్టిండీస్ నెం.9-10 బ్యాటర్లు, మన పేసర్లను ఈజీగా ఆడేశారు. ఇలాంటి మ్యాచులు గెలవాలంటే స్మార్ట్‌గా వ్యవహరించాలి..’ అంటూ ట్వీట్లు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్..

88
India vs West Indies

‘రెండు మ్యాచుల్లోనూ యజ్వేంద్ర చాహాల్ తన 4 ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఇదే నన్ను భయపెడుతోంది... ’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. 

click me!

Recommended Stories