తెలుగోడి పవర్.. రెండో టీ20లో హాఫ్ సెంచరీతో రోహిత్, సూర్య రికార్డులు బ్రేక్ చేసిన తిలక్ వర్మ..

Published : Aug 06, 2023, 10:41 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, తన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచం మన్ననలు పొందాడు. వెస్టిండీస్ టూర్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కించుకున్న తిలక్, రికార్డుల మోత మోగిస్తున్నాడు..  

PREV
16
తెలుగోడి పవర్.. రెండో టీ20లో హాఫ్ సెంచరీతో రోహిత్, సూర్య రికార్డులు బ్రేక్ చేసిన తిలక్ వర్మ..

తొలి టీ20 మ్యాచ్‌లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన తిలక్ వర్మ, 20 ఏళ్ల వయసులో ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... 

26
Tilak Varma

ఆరంగ్రేటం మ్యాచ్‌లో 175+ స్ట్రైయిక్ రేటుతో అదరగొట్టిన తిలక్ వర్మ, భారత బ్యాటర్లు పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడిన రెండో టీ20లో 39 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..

36
Tilak Varma

రోహిత్ శర్మ తర్వాత అతి పిన్న వయసులో టీమిండియా తరుపున టీ20 హాఫ్ సెంచరీ బాదిన భారత క్రికెటర్‌గా నిలిచాడు తిలక్ వర్మ. మొట్టమొదటి టీ20 హాఫ్ సెంచరీ చేసినప్పుడు రోహిత్ శర్మ వయసు 20 ఏళ్ల 143 రోజులు కాగా, ప్రస్తుతం తిలక్ వర్మ వయసు 20 ఏళ్ల 271 రోజులు..

46

రోహిత్ శర్మ, సౌతాఫ్రికాపై టీ20 వరల్డ్ కప్ 2007 మ్యాచ్‌లో 40 బంతుల్లో 50 పరుగులు చేయగా, తిలక్ వర్మ ఒక్క బంతి తక్కువగా 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 21 ఏళ్ల 38 రోజుల వయసులో టీ20 హాఫ్ సెంచరీ బాదిన రిషబ్ పంత్, ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు.. 
 

56

41 బంతుల్లో 51 పరుగులు చేసిన తిలక్ వర్మ, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తొలి రెండు టీ20 మ్యాచుల్లో 90 పరుగులు చేసిన తిలక్ వర్మ, మొదటి 2 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 

66
Tilak Varma

సూర్యకుమార్ యాదవ్ మొదటి 2 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 89 పరుగులు చేయగా మన్‌దీప్ సింగ్ 83 పరుగులు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.. రెండు టీ20ల్లో అత్యధిక ఫోర్లు, అత్యధిక సిక్సర్లు, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు తిలక్ వర్మ..

Read more Photos on
click me!

Recommended Stories