ఇది టీమిండియా కాదు, బెస్ట్ ఐపీఎల్ జట్టులా ఉంది... శ్రీలంక కోచ్ మిక్కీ ఆర్థర్ కామెంట్...

First Published Jul 16, 2021, 11:27 AM IST

ఓ వైపు ఇంగ్లాండ్ టూర్‌లో విరాట్ కోహ్లీ సేన, ప్రాక్టీస్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంటే, శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని టీమిండియా... లంకతో వన్డే సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ఆదివారం ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు లంక కోచ్ మిక్కీ ఆర్థర్...

షెడ్యూల్ ప్రకారం శ్రీలంకతో వన్డే సిరీస్ జూలై 13నే ప్రారంభం కావాల్సింది. అయితే ఇంగ్లాండ్ టూర్ ముగించుకుని వచ్చిన లంక జట్టులో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో సిరీస్‌ 18కి వాయిదా పడింది...
undefined
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని ప్రధాన జట్టు ఇంగ్లాండ్ టూర్‌లో ఉండడంతో లంక టూర్‌కి వచ్చిన టీమిండియాను సెకండ్ స్ట్రింగ్ టీమ్‌గా పేర్కొన్నాడు లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ...
undefined
అయితే ఇది టీమిండియా సెకండ్ స్ట్రింగ్ టీమ్ కాదు, ఐపీఎల్ ఆల్ స్టార్స్ ఎలెవన్ జట్టు అంటున్నాడు శ్రీలంక కోచ్ మిక్కీ ఆర్థర్...
undefined
‘టీమిండియాను తక్కువ అంచనా వేయలేం. ఇదో అద్భుతమైన జట్టు. ఇందులో ఎందరో మంచి క్రికెటర్లు, స్టార్లు ఉన్నారు... ఓ రకంగా చెప్పాలంటే ఇది ఐపీఎల్ ఆల్ స్టార్స్ ఎలెవన్ టీమ్...
undefined
ప్రతీ ఐపీఎల్ టీమ్‌లోని యంగ్ అండ్ సీనియర్ స్టార్లు, ఇందులో ఉన్నారు... ఈ జట్టును ఎదుర్కోవడం లంక టీమ్‌కి ఛాలెంజింగ్‌గానే ఉండనుంది...
undefined
2023 వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని యంగ్ ప్లేయర్లను సిద్ధం చేయాలని అనుకుంటున్నాం. అయితే యువకులతో పాటు అనుభవం ఉన్న సీనియర్లు కూడా కావాలి...
undefined
డుహ్రామ్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘించిన కారణంగా మేం ఓ ఓపెనర్‌ని, ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లను కోల్పోయాం... ఇది మా ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది...
undefined
నా 12 ఏళ్ల కోచింగ్ కెరీర్‌లో ఇప్పుడు అతి క్లిష్టమైన సమయం. ఇలాంటి ప్రదర్శన ఇంతవరకెప్పుడూ చూడలేదు.. లంక జట్టు ఆత్మను కోల్పోయినట్టుగా ఆడుతోంది...’ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్...
undefined
జూలై 18 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్, టీ20 సిరీస్‌ జూలై 29 వరకూ సాగుతాయి. ఇందులో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది భారత జట్టు. ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే, టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేయబడింది లంక జట్టు.
undefined
click me!